దుగ్గిరాల ఇంట్లో జరిగే పూజకి కనకం వస్తుందా.. కావ్య ప్లాన్ ఏంటి?
on Oct 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -216 లో.. కావ్య రాజ్ ఇద్దరు స్వప్నని తీసుకొని రావడంతో.. రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. స్వప్నని ఎవరు తీసుకొని వెళ్లారు? వాడి అంతు చూస్తానంటూ రాహుల్ ఓవర్ యాక్షన్ చేస్తుంటే.. అంత అవసరం లేదు, పోలీస్ లకి పట్టించామని కావ్య అనగానే.. రాహుల్ రుద్రాణి ఇద్దరు కంగారుపడతారు. ఎవడు తీసుకొని వెళ్ళాడో వాడికి బుద్ది లేదంటూ అందరు తిడుతుంటే.. ఇక ఆపండి అంటూ రుద్రాణి అంటుంది.
కాసేపటికి రేపు అందరం వినాయకుడి పూజ చెయ్యాలని ఇందిరాదేవి చెప్తుంది. స్వప్నని రాహుల్ గదిలోకి తీసుకొని వెళ్తుంటే.. ధాన్యలక్ష్మి స్వప్న కడుపు వారం రోజుల్లోనే ఇంత పెరిగిందేంటని అడుగుతుంది. అదేంటీ నాలుగు నెలలు అన్నప్పుడు పెరగదా అని స్వప్న చెప్పి వెళ్ళిపోతుంది. మరొక వైపు ప్లాన్ ఫెయిల్ చేసినందుకు రాహుల్ చెంప చెళ్లుమనిపిస్తుంది రుద్రాణి. నిన్ను అందలం ఎక్కించాలని అనుకుంటే.. నువ్వు మాత్రం ఇలాగే ఉంటావ్ ఇక స్వప్నకి ఆరు నెలలు వచ్చాయంటే.. మనం ఏం చెయ్యలేమని రుద్రాణి అనగానే.. ఇక నేను చూసుకుంటానని రాహుల్ అంటాడు. మరొకవైపు స్వప్నని మైఖేల్ కిడ్నాప్ చేసేంత సీన్ లేదు. అతని వెనకాల ఎవరో ఉన్నారని రాజ్ తో కావ్య అంటుంది. అప్పుడే కావ్య దగ్గరకి శ్రీనివాస్ వచ్చి.. విగ్రహాలు తయారు చేసినందుకు చెక్కు ఇచ్చి వెళ్తాడు. ఈ చెక్కు సేట్ కీ ఇచ్చి ఇంటి పత్రాలు మీ చేతుల మీదుగా మా వాళ్ళకి ఇవ్వండని రాజ్ తో కావ్య అంటుంది. మరొక వైపు అనామిక కళ్యాణ్ తో మాట్లాడుతుంది. " మా వాళ్ళు మీ ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడుతారు" అని అనామిక అనగానే.. వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదోనని కళ్యాణ్ అంటారు. మా వాళ్ళు వస్తున్నారని మీరు ఇంట్లో చెప్పకండని అనామిక చెప్పగానే.. దానికి కళ్యాణ్ సరే అంటాడు.
మరొక వైపు స్వప్న కిడ్నాప్ గురించి అప్పుకి కనకం చెప్తుంది. కాసేపటికి అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తే.. కోపంగా మాట్లాడి కట్ చేస్తుంది. మరొక వైపు కనకంకి కావ్య ఫోన్ చేసి.. చెక్కు ఇచ్చిన విషయం చెప్తుంది. మీరు రేపు ఇంట్లో పూజకి వస్తున్నారు కదా అని కావ్య అనగానే.. లేదు మీ అత్తయ్య గారు ఏం అంటారో అని కనకం అనగానే.. మా అత్తయ్య గారితో నేను ఫోన్ చేపిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే అపర్ణతో కనకంకి ఫోన్ చెప్పించాలని కావ్య అనుకొని మాట్లాడుతుంది. " నేను మా ఆయనతో పుట్టింటికికి వెళ్లి వస్తాను అత్తయ్య.. ఇంటి పత్రాలు ఆయన చేతుల మీదుగా ఇవ్వాలని మా వాళ్ళు ఆశపడుతున్నారు" అందుకే అని కావ్య చెప్పగానే.. ఎందుకు వాల్లే ఇక్కడికి వస్తే సరిపోతుంది కదా అని అపర్ణ అంటుంది. మా అమ్మ చాలా మొండిది. ఎవరి మాట వినదని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
