ప్రభాకర్ రాకతో సంతోషంలో కృష్ణ!
on Oct 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -277 లో.. కృష్ణ దగ్గరకి తన బాబాయ్, పిన్ని వాళ్ళ పిల్లలు వస్తారు. వాళ్లని చూసి ఆనందంగా కృష్ణ బయటకు వెళ్తుంది. అందరు కృష్ణతో పాటుగా బయటకు వస్తారు. కృష్ణ వాళ్ల బాబాయ్ ప్రభాకర్ అందరిని పరిచయం చేసుకుంటాడు. అక్క బాగున్నారా అంటూ భవానిని ఆత్మీయంగా పరిచయం చేసుకుంటాడు ప్రభాకర్.
కాసేపటికి కృష్ణ ఇంట్లో అందరిని పరిచయం చేస్తుంది. ప్రభాకర్ అతని భార్య శకుంతల మాట్లాడే విధానం ముకుందకి నచ్చదు. ఏంటి ఈ వెధవ సంత అని తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ముకుందని చూసిన ప్రభాకర్.. ఇంట్లో అందరు బాగా కన్పిస్తునారు కానీ ఈ బిడ్డ తేడాగా కనిపిస్తుందని ప్రభాకర్ అంటాడు.అవన్నీ ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందామని భవాని అనగానే.. అందరు లోపలకి వెళ్తారు. మరొక వైపు మధు, అలేఖ్య సెల్ఫ్ డబ్బా గురించి మాట్లాడుకుంటారు. ప్రభాకర్ బాబాయ్ తో రీల్స్ చేస్తే బాగుంటుందని మధుకి అలేఖ్య ఐడియా ఇస్తుంది. అవును మంచి ఐడియా అంటూ మధు అంటాడు. మరొక వైపు అందరు టిఫిన్ చేస్తుంటారు. మురారి పక్కన చైర్ లో ముకుంద కూర్చొబోతుంటే.. అక్కడ నువ్వు కూర్చోవద్దు, కృష్ణ కూర్చొవాలని ప్రభాకర్ అనగానే.. నేనేం కూర్చోవడం లేదు వడ్డీస్తానని చెప్తుంది. కాసేపటికి మురారి పక్కన కృష్ణ కూర్చొని ఉంటుంది. ప్రభాకర్ ఇడ్లీలో సాంబార్ వేసుకొని అన్నం తిన్నట్టు తినేసరికి అందరూ అదోలా చూస్తుంటారు. ముకుంద అయితే వాంతి చేసుకున్నట్లు చేస్తుంది. నేను ఇప్పుడే తిన్నానంటూ తన రూమ్ లోకి వెళ్తుంది. అందరూ టిఫిన్ చేసాక అలేఖ్య కూడా ముకుంద గదిలోకి వెళ్లేసరికి.. ముకుంద కోపంగా వస్తువులు పడేస్తుంటుంది. అలా ఉండేసరికి అలేఖ్య తనని ఆపుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నవని అడుగుతుంది. నా చేతకాని తనం వల్ల, నా మీద నాకే కోపం వస్తుంది. అందరు నా పరువు తీస్తున్నారని కోపంగా తన బాధని అలేఖ్యకి చెప్పుకుంటుంది ముకుంద.
నువ్వు నీ ప్రేమని చెప్పలేవు, అలాగే నీకు ఆదర్శ్ అంటే ఇష్టం లేడని కూడా చెప్పలేవని ముకుందకి అలేఖ్య చెప్తుంది. నీ గురించే, నీ మంచికే చెప్తున్నానని ముకుందకి సపోర్ట్ గా అలేఖ్య మాట్లాడుతుంది. మరొకవైపు కృష్ణ, మురారిల గదిలోకి ప్రభాకర్ అతని భార్య శకుంతల వస్తారు. గదిలో ఉన్న తన అన్న ఫోటో చూసి ఎమోషనల్ అవుతాడు ప్రభాకర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
