తల్లి కాబోతున్న జ్యోతక్క...అందుకే ఇన్ని రోజులు చెప్పలేదు
on Oct 3, 2025
.webp)
బుల్లితెర మీద శివజ్యోతి అలియాస్ జ్యోతక్క ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. గంగులు, శివ జ్యోతి ఇద్దరూ కలిసి ఎన్నో టీవీ షోస్ లో కనిపిస్తూ ఉంటారు. జ్యోతక్క బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చింది. అలాంటి శివ జ్యోతి రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విషయాన్నీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది. పిల్లలు ఆదుకునే ఒక స్కూటర్, ఒక జీప్ ని చూపిస్తూ గంగులు, జ్యోతి ఇద్దరూ కలిసి అమ్మాయి పుడతది అంటే కాదు అబ్బాయి పుడతాడు అంటూ పోట్లాడుకున్నారు.
సరే చూసుకుందాం 2026 లో అంటూ సరదాగా ఫైట్ చేసుకున్నారు. "అందరికీ దసరా శుభాకాంక్షలు..ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో మాకు 2026 లో బిడ్డ పుట్టబోతోంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు నాకు కావలిసినవాళ్లు. సొంత అక్క బావకి బిడ్డ పుట్టాలి అని గట్టిగా కోరుకున్నారు ..ఇట్ల బిడ్డ అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయితరు అనుకుంటున్న అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట ..దిష్టి పెట్టకండి. దీవెనలు ఇవ్వండి. దిష్టి కన్నా దీవెనే గొప్పది అని ప్రూవ్ చేద్దాం. ఈ బ్యూటిఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినోళ్లను నా సపోర్ట్ గా ఉన్నళ్లోను లైఫ్ లాంగ్ మర్చిపోను. అలాగే బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను .. థ్యాంక్యూ మీ లవ్ , సపోర్ట్ కి అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి నాకు, మా ఫ్యామిలీకి, స్పెషల్ గా మా ఈ చిన్న బేబీకి" అంటూ పోస్ట్ చేసింది. ఇక ప్రియాంక జైన్, రవికృష్ణ, సుప్రీతా, మహిశివన్, అనిల్ గీలా, సిరి హన్మంత్, నాగదుర్గా, అంజలి తోట, వింధ్య విశాఖ, అన్షు రెడ్డి, హరితాజాకి, రోహిణి ఇలా అందరూ విషెస్ చెప్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



