Bigg boss 9 telugu: కంటెండర్స్ గా ఆ నలుగురు.. వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ!
on Oct 3, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో నాలుగో వారం టాస్క్ లతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. అయితే పవర్ కార్డ్స్ ని పొందే క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్, ఎమోషనల్ స్టోరీస్ జరిగాయి. నిన్నటి గురువారం నాటి ఎపిసోడ్ లో మొదటగా ఆడిన టాస్క్ లలో గెలిచి పవర్ కార్డ్స్ పొందిన రెడ్ టీమ్ కి బిగ్ బాస్ అభినందించాడు. ఆ తర్వాత మిగిలిన వారిలో నుండి కంటెండర్స్ గా సెలెక్ట్ చేయడం కోసం రెడ్ టీమ్ ని టీమ్ లుగా చేయమన్నాడు బిగ్ బాస్. దాంతో కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కలిసి టీమ్ లు చేశారు. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రాము.. ఇలా టీమ్స్‌ని ఏర్పాటు చేశారు. గేమ్ ఏంటంటే.. స్టార్ట్ బజర్ మోగగానే ఒక జంట వచ్చి ఎల్లో లైన్ స్టార్ట్ పాయింట్ నుంచి తాళ్లతో కూడిన ఆ ఉచ్చు లోపలికి వెళ్లి దాని నుంచి బయటికొచ్చి టైర్స్ లోపల తమ అడుగులు ఉండేలా నడుచుకుంటూ వెళ్లి అక్కడున్న ఉడెన్ ప్లాంక్స్‌ని దాటి బోన్‌ని తీసుకోవాలి.. ఎవరైతే ముందుగా ఆ బోన్‌ని తీసుకుంటారో వారు ఆ రౌండ్ విజేతలవుతారు.. అలానే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు..మీరు ఉడెన్ ప్లాంక్స్ దాటే సమయంలో మీ కాళ్లు ఉడెన్ ప్లాంక్స్ మధ్య ఉండేలా చూసుకోవాలి.. తాళ్ల కింద నుంచి పాకుతూనే వెళ్లాలంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు.
సుమన్ శెట్టి-తనూజ మొదటగా టాస్క్ ఆడారు. అయితే సుమన్ శెట్టి టైర్ లోపలి నుంచి బయట కాలు పెట్టడంతో మధ్యలోనే డిస్‌క్వాలిఫై అయిపోయాడు. అయితే తనూజ కూడా ఉడెన్ ప్లాంక్స్ అన్నింటి మధ్యలో నుంచి వెళ్లలేదని ఇమ్మూ డిస్‌క్వాలిఫై చేశాడు. దీంతో వీళ్లిద్దరి నుంచి ఎవరూ కంటెండర్ కాలేకపోయారు. దీనికి హర్ట్ అయిన తనూజ వాష్‌రూమ్‌కి వెళ్లి తలుపేసుకుంది. దీంతో రీతూ-డీమాన్ వెనకాలే వెళ్లి.,. రా బయటికి.. ప్లీజ్ తనూజ రా ఒకసారి రా.. ఒక్కసారి తియ్ ప్లీజ్ ఒక్కసారి తీయవా.. డోర్ తీయవా..నేను వస్తా లోపలికి.. అంటూ రీతూ బ్రతిమాలింది. తనూజ చూడు తనూజ.. గేమ్ మానేసి వచ్చేసింది. నీ గురించి.. అంటూ డీమాన్ కూడా రిక్వెస్ట్ చేశాడు. దీంతో తనూజ డోర్ ఓపెన్ చేయగానే రీతూ లోపలికి వెళ్లి డోర్ వేసింది. ఇద్దరూ లోపల ఏడుస్తూ కూర్చున్నారు. బయట ఉన్న డీమాన్.. త్వరగా రండి మీరు.. అంటూ బతిమాలాడు. ఎంత కష్టపడి ఆడాను.. డిస్‌క్వాలిఫై అని అంత ఈజీగా చెప్పేశారు.. కష్టపడే కదా ఆడాం.. ఈజీగా చెప్పేస్తారు.. దాన్ని కన్సిడర్ చేయకుండా డిస్‌క్వాలిఫై అంటే ఎలా ఉంటుంది చెప్పు.. అంటూ లోపల తనూజ ఏడ్చింది. సరే ఏం కాదు అయిపోయింది కదా తనూజ.. స్టే స్ట్రాంగ్.. రీతూ రండి బయటికి.. అంటూ డీమాన్ పిలిచాడు. వద్దు నేను రాను.. నేను ఇప్పుడు రాను ప్లీజ్.. అంటూ రీతూతో చెప్పింది తనూజ. నువ్వు రాకపోతే నేను వెళ్లను ప్లీజ్ రా.. అని రీతూ పట్టుపట్టడంతో ఇద్దరూ బయటికి వచ్చారు. ఏం మాట్లాడకండి కామ్‌గా ఉండండి కాసేపు .. అంటూ సలహా ఇచ్చాడు డీమాన్.
ఆ తర్వాత సంజన-రాము మధ్య ఇదే ఛాలెంజ్ పెట్టగా రాము గెలిచి కంటెండర్ అయ్యాడు. చివరగా ఫ్లోరా-రీతూ మధ్య పోటీలో రీతూ గెలిచి కంటెండర్ అయింది. దీంతో ఓవరాల్‌గా కళ్యాణ్, ఇమ్మూ, రాము, రీతూ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. ఇక శుక్రవారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో వీరికి టాస్క్ పెట్టి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేస్తారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



