రాగ సుధ ఎక్కడుందో ఆర్య వర్థన్ కి తెలిసిపోయిందా?
on Mar 4, 2022

బుల్లితెరపై ఆసక్తికరమైన కథ, కథనాలతో ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. మారాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. తెలుగుతో పాటు ఈ సీరియల్ ఆరు భాషల్లో రీమేక్ అయింది. బెంగాలీ భాషలో రీమేక్ చేయాలని ప్రయత్నించి చివరికి డబ్ చేశారు. ప్రస్తుతం తెలుగుతో పాటు ఒడియా, హిందీ భాషల్లో మాత్రమే కంటిన్యూ అవుతోంది.
తన కంపనీలో పనిచేసే స్టాఫ్ కు ఫ్లాట్స్ ఇవ్వాలని ఆర్యవర్థన్ నిర్ణయించుకుంటాడు. ఆ విషయం తెలిసిన మాన్సీ కంపనీ ఎంప్లాయిస్ ని దారుణంగా అవమానిస్తుంది. ఆత్మాభిమానం లేని వాళ్లైతే తేరగా వచ్చే వాటిని తీసుకుంటారని కించపరుస్తుంది. దీంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న ఉద్యోగులు మూకుమ్మడిగా ఆర్యవర్థన్ ఇచ్చే ఫ్లాట్స్ తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు. ఈ విషయం మీరాకు తెలుస్తుంది. తను అనుతో చెబుతుంది.

అయితే ఆర్య వర్థన్ ..అను, మీరా, జెండేలని సంప్రదించిన తరువాత ఎంప్లాస్ కి ఫ్లాట్స్ పేపర్స్ మాన్సీ చేతుల మీదుగా అందజేయాలని నిర్ణయించుకుంటారు. తనే అందించేలా అను ప్లాన్ చేస్తుంది. ఆ విషయాన్ని ఆర్య పిలిచి మాన్సీతో చెబుతాడు. ఆర్య తనని పిలవడంతో విషయం తెలిసిపోయిందని మాన్సీ అదరిపడుతుంది. ఆ తరువాత తెలియలేదని గమనించి కుదుటపడుతుంది. కానీ ఎంప్లాయిస్ ని అవమానించిన తనే ఫ్లాట్స్ కి సంబంధించిన పేపర్స్ ఇవ్వాలని ఆర్య నిర్ణయించడంతో ఏం చేయాలో మాన్సీకి అర్థం కాదు. తప్పించుకోవడానికి ఛాన్స్ లేకపోవడంతో చేసేది లేక ఎంప్లాయిస్ కి ఫ్లాట్స్ కి సంబంధించిన దస్తావేజులు అందించడానికి వెళుతుంది. కంపనీలో సీరియర్ శంకర్ గారి నుంచి పంపిణీ మొదలుపెడుతుంది. కానీ అతను దస్తావేజులు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. దీంతో ఎక్కడ తను అవమానించిన నిజం తెలిసిపోతుందేమోనని మాన్సీ బ్రతిమాలడం.. ఆర్య చెప్పడంతో తీసుకుంటాడు.
కట్ చేస్తే... జెండే మనుషుల నుంచి తప్పించుకున్న వశిష్ట .. రాగసుధ కోసం సుబ్బు వుంటున్న ఇంటి ముందు తిరుగుతూ వుంటాడు. అతన్ని వెంబడించి వెంట వచ్చిన జెండే మనుషులు చాటుగా అతన్ని గమనించి ఆ విషయాన్ని జెండేకి ఫోన్ ద్వారా తెలియజేస్తారు. వెంటనే ఆ లొకేషన్ తనకు షేర్ చేయమని చెప్పిన జెండే ఆ విషయాన్ని ఆర్యకు తెలియజేస్తాడు. ఇద్దరూ కలిసి రాగసుధ కోసం వశిష్ట ఎదురుచూస్తున్న ప్లేస్ కి బయలుదేరతారు. ఇదే సమయంలో టిఫిన్ సెంటర్ వద్ద పని పూర్తయిపోవడంతో సుబ్బు .. రాగసుధని ఇంటికెళ్లిపోమంటాడు. రాగసుధ ఇంటికి బయలు దేరుతుంది. అక్కడే వున్న వశిష్టని చూసి షాకవుతుంది. కానీ విశిష్టకు కనిపించదు.. ఈ ఇద్దరిని జెండే, ఆర్య వర్థన్ గమనించారా? .. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



