'ఫన్ బకెట్' మహేశ్ విట్టా నాలుగేళ్ల లవ్ స్టోరీ!
on Mar 4, 2022

సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన కమెడియన్ మహేష్ విట్టా ఫన్ బకెట్ వెబ్ సిరీస్, బిగ్ బాస్ షోల తర్వాత సెలబ్రిటీ అయిపోయాడు. ఫన్ బకెట్ కారణంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే చాన్స్ కొట్టేసిన మహేష్ విట్టా ఇప్పుడు తానే సొంతంగా ప్రొడక్షన్ కంపనీ పెట్టి సినిమాలు నిర్మించే స్థాయికి వచ్చేశాడు. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ విట్టా ఈ సందర్భంగా తన లవ్ స్టోరీని బయటపెట్టాడు. బిగ్‌బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేసిన మహేష్ విట్టా బయటికి వెళ్లాక ఓ రేంజ్ లో స్థిరపడ్డాడు. బిగ్ బాస్ ఓటీటీ లో అవకాశం రావడంతో తన వ్యక్తిగత విషయాల్ని వెల్లడించాడు.
"నాలుగేళ్లుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఇద్దరం లివిన్ రిలేషన్ లో వున్నాం. నాకు లవ్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. తను నా పక్కన వుంటే బాగుంటుందని అనిపించింది. అందుకే అమెనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నా సొంత ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా రిలీజ్ కాగానే ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం" అని అసలు సీక్రెట్ బయటపెట్టాడు మహేష్ విట్టా. సెప్టెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించాడు.
Also Read: `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.. డీఎస్పీ మార్చి సెంటిమెంట్!
తను ఐటీ ఉద్యోగి అని ఇండస్ట్రీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె తన చెల్లెలి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. "ఫస్ట్ టైం తనని చూసినప్పుడు మా అమ్మ ఫేస్ కట్ కనిపించింది. నాకు కనెక్ట్ అయిపోయింది. వెంటనే ప్రపోజ్ చేశా. తాను మాత్రం రిజెక్ట్ చేసింది. రెండేళ్ల తరువాతే నాకు ఓకే చెప్పింది. తరువాత ఇద్దరం ఒకిరి ఇంట్లో ఒకరం చెప్పుకున్నాం. ఇంట్లో వాళ్లు ఓకే అన్నారు. మా ఊరిలోనే పెళ్లి" అని వివరించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



