గంగ ప్రతీ పని సక్సెస్.. డిజప్పాయింట్ అయిన వీరు, ఇషిక!
on Sep 6, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -47 లో......వినాయకుడి విగ్రహం కనిపించకపోవడంతో అందరు టెన్షన్ పడతారు. విగ్రహాన్ని వెతుకుంటే ఒకటి పాత గణేష్ విగ్రహం కనిపిస్తుంది. ఇదంతా బాను గారి సంకల్పం.. ఆ రోజు నిమజ్జనం చేయకుండా వదిలేసిన ఈ విగ్రహాన్ని ఇప్పుడు మనకి కనిపించేలా చేసాడని గంగ అంటుంది.
గంగ మాటలు అందరిలో ఆలోచన కలిగించేలా చేస్తాయి.. అందరు కలిసి వినాయకుడి విగ్రహం ముందుకు లాగుతారు కానీ ఎవరివల్ల కాదు.. ఒకవైపు గంగ మరొకవైపు రుద్ర తాడుతో వినాయకుడి విగ్రహం ముందుకు లాగుతారు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపు ఈ వినాయకుడి విగ్రహం నిమజ్జనం చెయ్యాలి.. దానికి దేవుడిని సిద్ధం చెయ్యాలి. అందుకు మీరు రెడీనా అని గంగ అనగానే అందరు ఫుల్ జోష్ తో రెడి అంటారు.
అందరు హ్యాపీగా ఉన్నా ఇషిక, వీరు మాత్రం డిస్సపాయింట్ అవుతారు. వాళ్ళు చేసిన ప్రతీ ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందన్నట్లు కోపంగా ఉంటారు. మరొకవైపు రుద్ర కాపాడిన పాప చిన్ని.. గంగకి ఫోన్ చేస్తుంది. అక్క.. నేను చిన్ని ని నువ్వు మొన్న మా సర్ ని చూస్తానన్నావ్ కదా.. రేపు కిండర్ గార్డెన్ దగ్గరికి సర్ వస్తున్నారని చెప్పగానే గంగ ఎలాగైనా సర్ ని చూడాలని ఉత్సాహంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



