Jayam serial : దొంగబాబా గురించి నిజం చెప్పేసిన గంగ.. వీరు దొరికిపోతాడా!
on Jan 27, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -177 లో... విభూది బాబా చెప్పిన మాటలతో గంగ బాధపడి ఇంట్లో నుండి అకాడమీకి వెళ్ళిపోతుంది. ఇక అదే సమయంలో గంగని చంపేయమని తనపైకి రౌడీలని పంపిస్తాడు వీరు. అయితే వారిని తుక్కుతుక్కుగా కొట్టేస్తుంది గంగ. ఇక అదే సమయంలో స్టేషన్ లో విభూది బాబా ఫోటో చూసి.. ఇతని ఫోటో ఇక్కడుందేంటని అడుగగా.. వాడో దొంగ బాబా అని పోలీసులు చెప్తారు. దాంతో వాడిని కొట్టడానికి గంగ కోపంగా వెళ్తుంది. అదే సమయంలో స్టేషన్ లోని పోలీసులు గంగ గురించి రుద్రకి కాల్ చేసి చెప్తారు .
ఇక రుద్ర దొంగబాబా దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ దొంగబాబాని గంగ కొడుతుంటే రుద్ర ఆపి ఇంటికి తీసుకొస్తుంటాడు. అదేసమయంలో ఇంట్లోని పెద్దసారు, వంశీ, ఇషిక, వీరు, సూర్య అంతా గంగ కోసం ఎదురుచూస్తుంటారు. తన కోసం మొత్తం వెతికాం పెద్దనాన్న ఎక్కడ కనపడలేదని వంశీ అంటాడు. ట్యాంక్ బండ్ లో చూడాల్సింది బ్రో అని ఇషిక తన మనసులో అనుకుంటుంది. వీరు కూడా అలానే అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి గంగని తీసుకొని రుద్ర వస్తాడు. దాంతో ఇషిక, వీరు తప్ప అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఏం అయింది రుద్ర గంగని తీసుకొని వస్తున్నట్టు చెప్పాలి కదా అని వాళ్ళ బాబాయ్ అడుగగా.. తనని తీసుకురావాలనే టెన్షన్ లో మర్చిపోయాను బాబాయ్ అని రుద్ర అంటాడు. ఏమైంది రుద్ర అని పెద్దసారు అంటాడు. అప్పుడే శకుంతల వచ్చి.. ఏముంది.. ఇంట్లో తన వల్ల అరిష్టమని బాబా చెప్పాడు కదా అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని శకుంతల అనగానే.. అది కాదు అమ్మగారు.. వాడో దొంగబాబా.. నేను ఇంట్లో నుండి అకాడమీకి వెళ్ళిపోయాక నన్ను రౌడీలు వెంబండించారు. వారిని కొట్టేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ వాంటెడ్ లిస్ట్ లో ఈ విభూది బాబా ఉన్నాడని, వాడో దొంగబాబా అని అప్పుడు తెలిసిందంటూ గంగ జరిగింది మొత్తం చెప్తుంది. ఇక అందరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే ఎవరిని పడితే వారిని నమ్మకూడదని శకుంతల అంటుంది. ఆ తర్వాత అసలు వాళ్ళని అలా ఎలా కొట్టావ్ వదిన అని వంశీ అడుగగా.. మీ అన్నయ్య ఇచ్చిన ట్రైనింగ్ ఏ అని గంగ అంటుంది. అదేదో పెద్ద విజయంలాగా గొప్పగా చెప్తున్నావ్.. ఇలాంటి తింగరిపనులు చేయకుండా నీకు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని రుద్ర అంటాడు. అమ్మో వద్దని గంగ అనగానే.. ఈ రోజంతా నీకు ఫుడ్ కట్ అదే పనిష్మెంట్ అని చెప్పి వెళ్ళిపోతాడు రుద్ర. పెద్దోరు మీరైనా చెప్పండి అనగానే.. నాకు ఏం సంబంధం లేదని పెద్దసారు వెళ్ళిపోతాడు. ఇక వీరు, ఇషిక ఒక దగ్గరికి వెళ్తారు. గంగని చంపడానికి ఎన్ని స్కెచ్ లు వేసినా ఫలించట్లేదని వీరు అనుకుంటాడు. ఇషిక, వీరు ఇద్దరు కలిసి గంగ, వీరులని దూరం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



