Karthika Deepam2 : సాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న డాక్టర్.. జ్యోత్స్న కన్నకూతురు కాదు!
on Jan 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -577 లో..... దాస్ తో ఫోన్ మాట్లాడుతుంది జ్యోత్స్న. దాస్ వార్నింగ్ ఇస్తుంటే.. నువ్వు నన్ను ఏం చెయ్యలేవని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. జ్యోత్స్న వెనక్కి తిరిగి చూసేసరికి పారిజాతం ఉంటుంది. ఎవరితోనే మాట్లాడుతున్నావని పారిజాతం అంటుంది. ఫ్రెండ్ తో అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నిజంగానే దాస్ ని నువ్వు చూడలేదా అని పారిజాతం అడుగుతుంటే.. ఇంటికి రాని అతన్ని ఎలా చూస్తానని జ్యోత్స్న దబాయిస్తుంది. ఇదంతా బావ కావాలనే చేస్తున్నాడని అర్థం చేసుకోమని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది జ్యోత్స్న. నిజమే అయి ఉండొచ్చు ఈ కార్తీక్ గాడు మా మధ్య గొడవ పెట్టడానికి ఇలా చేస్తున్నాడని పారిజాతం అనుకుంటుంది.
జ్యోత్స్న గదిలోకి వెళ్లి పర్సు తీసుకొని బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని పారిజాతం అడుగుతుంది. నాకు భయంగా ఉంది అని జ్యోత్స్న అంటుంది. రిపోర్ట్స్ గురించా అని పారిజాతం అడుగుతుంది. డాక్టర్ రాదు రిపోర్ట్స్ తీసుకొని రాదని జ్యోత్స్న అంటే డాక్టర్ ని ఇది ఏమైనా చేసిందా అని పారిజాతం అనుకుంటుంది. జ్యోత్స్న కిందకి వస్తుంటే డాక్టర్ రిపోర్ట్స్ తో ఎంట్రీ ఇస్తుంది. వెంటనే భయంతో జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. డాక్టర్ వచ్చింది రిపోర్ట్స్ తీసుకొని వచ్చిందని జ్యోత్స్న అనగానే రాదన్నావ్ కదా అని పారిజాతం అంటుంది. నాకున్న ఇన్ ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు డాక్టర్ బిజీ అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దీప వచ్చి అమ్మాయి గారు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్తుంది. ఏంటి భయపెడుతున్నావని జ్యోత్స్న అనగానే అంటే నా మాటలు బయపెట్టేలా ఉన్నాయా అని దీప అంటుంది. అందరు హాల్లోకి వస్తారు. రిపోర్ట్స్ రేపు వస్తాయి అన్నారని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. కార్తీక్ ఫోన్ చేసి ఈ రోజు తీసుకొని రమ్మని చెప్పాడని డాక్టర్ చెప్తుంది.
ఆ తర్వాత రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెప్పగానే ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. మా బంఢారం మొత్తం బయటపడుతుందని పారిజాతం భయపడుతుంది. అంటే మీరు జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ కాకపోతే జ్యోత్స్న మా అత్త కూతురు కాదు అన్నారు కదా డాక్టర్ అని కార్తీక్ అంటాడు. అవును అని డాక్టర్ చెప్తుంది. నాకు మీ మీద డౌట్ ఉంది డాక్టర్.. మీ నిర్లక్ష్యం వల్ల రిపోర్ట్ చేంజ్ అయిందేమోనని డాక్టర్ ని తప్పు పడుతుంది జ్యోత్స్న. అలా అంటారు ఏంటని డాక్టర్ అంటుంది. ఇక్కడ ట్రీట్ మెంట్ వద్దు మమ్మీ కెనడా తీసుకొని వెళ్తాను. అక్కడ ట్రీట్ మెంట్ ఇప్పిస్తానని జ్యోత్స్న అంటుంది. ఎక్కడ అయినా ఇదే ట్రీట్ మెంట్ అని దశరథ్ అంటాడు. డాక్టర్ చాలా మంచివారని దశరథ్ అనగానే థాంక్స్ అండి అర్ధం చేసుకున్నందుకు అని మందులు అందులో రాసానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్, దీప, శ్రీధర్, కాంచన ఇంటికి వెళ్తారు. కార్తీక్, దీప మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా.. మరి నిన్న నైట్ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవని ముందే మీకెలా తెలుసని కాంచన అడుగుతుంది. అక్కడే శ్రీధర్ కూడా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



