దోశెకు కుట్లేసి అవార్డు అందుకున్న పటాస్ ఫైమా
on Dec 4, 2023

ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ప్రతీ చిన్న విషయం కూడా పెద్ద టాపిక్ ఐపోతోంది. క్రియేటివిటీ ఉండాలే కానీ ప్రతీ విషయం కూడా క్లిక్ అవుతోంది...ఇక వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఐపోతున్నారు. అందులోనూ జబర్దస్త్ కడియన్స్ ఏది చేసిన అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ అటు అవార్డ్స్ ని ఇటు రివార్డ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి కమెడియన్స్ లో లేడీ కమెడియన్ గా బులెట్ భాస్కర్ టీమ్ ని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లి బిగ్ బాస్ ఆఫర్ తెచ్చుకున్న ఫైమా అంటే చాల మందికి ఇష్టం కూడా...చిన్నగా ఎదుగుతూ ఇప్పుడు ఒక సెలబ్రిటీ రేంజ్ కి వెళ్ళిపోయింది. తన కలర్ గురించి తన ఫేస్ గురించి ఎవరు కామెంట్ చేసిన పెద్దగా పట్టించుకోదు.. అలాంటి ఫైమా రీసెంట్ గా ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ వీడియొ చూస్తే తెలివి తెల్లారినట్టే ఉంది అనుకోక మానరు..ఎందుకంటే ఈ మధ్యకాలంలో అవార్డ్స్ కోసం, సెలబ్రిటీ స్టేటస్ కోసం, స్పెషల్ ఐడెంటిటీ కోసం చాలామంది క్రియేటివిటీ స్కిల్స్ ని పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫైమా కూడా పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద వయ్యారంగా ఒక అట్టు పోసింది. ఇక ఫైమా అమ్మ, అక్కా ఆ అట్టు పొయ్యడాన్ని చూసి మూతులు తిప్పుకుంటారు. ఐతే ఆ అట్టుకు మధ్యలో ఖాళి వచ్చేసరికి దానికి కుట్లేసింది...దాంతో వంటల పోటీలో ఫైమా గెలవడంతో చాలామంది వచ్చి అవార్డ్స్ ఇచ్చారు. ఈ వీడియో చూడడానికి చాల ఫన్నీగా ఉంది. ఇక కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇలాంటి వీడియోస్ చేయడం ఆపేయండి అంటే ఇంకొంతమంది మీరు చూడడం ఆపేయండి అంటూ కౌంటర్లు ఇచ్చారు. వంట చేయడం కూడా ఒక పెద్ద క్రియేటివిటీ ఐపోయిందనే విషయం అర్ధమవుతోంది అంటున్నారు నెటిజన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



