బిటెక్ వర్సెస్ రైతుబిడ్డ నామినేషన్ రిపీట్!
on Dec 4, 2023

బిగ్ బాస్ సీజన్-7 లో ఎవరి ఊహకందని ట్విస్ట్ లు , ఆర్గుమెంట్స్ జరుగుతున్నాయి. పద్నాలుగవ వారం నామినేషన్ ల డిస్కషన్ చూస్తే బుర్రపాడవ్వాల్సిందే. ఎవరు ఎవరికి ఎలవేషన్ ఇస్తున్నారో, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రేక్షకులు.
బిగ్ బాస్ మొదటి ప్రోమోలో యావర్, శోభాశెట్టి హైలైట్ గా నిలిస్తే.. సెకండ్ ప్రోమో రైతుబిడ్ వర్సెస్ బిటెక్ బాబు ఆర్గుమెంట్ తో హీటెక్కిపోయింది. ఎవర్రా నువ్వు అని అమర్ దీప్.. రా అనొద్దు అన్న అని ప్రశాంత్ అంటు నామినేషన్ ప్రక్రియ మొదలైనట్టుంది. మాటల తూటాలు బిగ్ బాస్ హౌస్ లో టాపాసుల్లా పేలినట్టు ఈ ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. నా తమ్ముడిని ఎలాగైనా పిలుస్తా.. నచ్చితే పలుకు లేకపోతే పో అంటూ అమర్ దీప్ హైపర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ అమర్ కోసం మాటిచ్చాడు.. అంటూ పాత విషయాలు తవ్వాడు అమరదీప్. అందుకే కదా అన్న నిన్ను నేను గేమ్‌లో కొట్టానా అంటూ ప్రశాంత్ డిఫెండ్ చేసుకున్నాడు. అయితే అమర్, ప్రశాంత్ నామినేషన్ మధ్యలో శోభా దూరి.. "ఆ రోజు చెప్పాను.. ఈ రోజు చెబుతున్నాను. హౌస్‌లో సేఫ్ ప్లేయర్ పల్లవి ప్రశాంతే" అంటూ శోభాశెట్టి అంది. అలానే ప్రశాంత్ చెప్పే డైలాగులు చెబుతు తనని వెక్కిరించింది శోభాశెట్టి.
యావర్, అర్జున్ ల మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్టు తెలుస్తుంది. తన సెకెండ్ నామినేషన్ గా అమర్ దీప్ ని అర్జున్ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు అమర్, ప్రశాంత్ లు ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ డిస్కషన్ సాగుతుండగా.. అమర్ కి చిరాకేసి చేతిలో ఉన్న సుత్తి నేలకోసి కొట్టేసి.. ఛీ ఆపరా నీ అబద్ధాలు అంటూ పక్కకిపోయాడు. " నీ కోసం నిలబడినోళ్లని మోసం చేసే గుణం నీదే" అంటూ ప్రశాంత్ అన్నాడు. అమర్ అన్న నన్ను ఎట్లా చేశాడో మీరే చూశారంటూ ఆడియన్స్‌కి చెప్పుకున్నాడు ప్రశాంత్. అది విని అమర్ దీప్.. " అవును నన్ను బయటికి పంపించేయండి, వాడికి కప్పు ఇచ్చేయండి. మీరందరూ హ్యాపీగా ఉండండి" అంటూ హైపర్ అయ్యాడు అమర్ దీప్. మరోసారి రైతుబిడ్డ వర్సెస్ బిటెక్ బాబు నామినేషన్ అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



