Illu illalu pillalu : కోడలి బుట్టలో పడ్డ రామరాజు.. శ్రీవల్లి, చందులకి బంపర్ ఆఫర్!
on Jun 12, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 182 లో.. బావ మనకి కొత్తగా పెళ్లి అయింది. నాలుగు రోజులు ఎక్కడికైనా సరదాగా వెళదామా అని చందుతో శ్రీవల్లి అనగానే.. నాన్నని అడుగుతాను ఒప్పుకుంటే వెళదామని చందు అంటాడు. మరుసటి రోజు ఉదయం వేదవతి నిద్రలేచేసరికి ఎక్కడి పని అక్కడే ఉంటుంది.
అప్పుడే నర్మద, ప్రేమ వస్తారు. శ్రీవల్లి కన్పించడం లేదు.. ఎక్కడ అని వేదవతి అనగానే నర్మద మాకేం తెలుసని వెటకారంగా మాట్లాడుతుంది. శ్రీవల్లి దగ్గరికి వేదవతి వెళ్ళగానే జ్వరం వచ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది. శ్రీవల్లి యాక్టింగ్ చేస్తున్న విషయం నర్మద ప్రేమకి అర్థమై తనని అటపట్టిస్తారు. నన్నే ఆటపట్టిస్తారా మీ సంగతి చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రామరాజు ముందు కావాలనే శ్రీవల్లి ఫోన్ మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తూ.. అమ్మా మావయ్య గారిని నేను అడగలేను అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ఏమైందని రామరాజు అడుగుతాడు. అంటే మా పక్కింటి వాళ్ళకి పెళ్లి అయి హనీమూన్ వెళ్లారట.. మీరు ఇంకా వెళ్లలేదా నేను పంపిస్తాను వెళ్ళండి అంటుంది. మావయ్య గారికి తెలియదా.. నువ్వు పంపించడం ఏంటని కోప్పడి ఫోన్ కట్ చేసానని శ్రీవల్లి అంటుంది.
ఆ తర్వాత చందుని రామరాజు పిలిచి.. మీరు నాలుగు రోజులు ఎటైనా వెళ్ళిరండి అని రామరాజు చెప్తాడు. శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా అందరు చూస్తుంటారు. రామరాజు వెళ్తుంటే వేదవతి ఆపి ఇంట్లో పెళ్ళైన జంటలు ఉన్నాయ్.. వాళ్లని కూడా వెళ్ళమని చెప్పకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని రామరాజుతో వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



