Brahmamudi: యామినికి షాక్.. కావ్య ప్లాన్ ఏంటంటే!
on Jun 12, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -745 లో... ఎందుకు వాళ్ళని పెళ్లికి పిలిచావని వైదేహి యామినిని తిడుతుంది. కానీ అవేం యామిని పట్టించుకోకుండా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత ఎందుకు యామినితో నా కుటుంబాన్ని తీసుకొని వస్తానని చెప్పావ్.. ఏదైనా ప్లాన్ చేసావా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఏం లేదు నాకు ఆ దేవుడిపై నమ్మకం ఉందని కావ్య అంటుంది.
ఆ తర్వాత ఆ పెళ్లిని మనం ఆపాలంటే యామిని మనిషి ఎవరో ఒకరు మనకి తెలిసి ఉండాలని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు పెళ్లి జరిపించడానికి పంతులు కావాలని యామిని వైదేహి పంతులు దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. ఈ టైమ్ కి ఫోన్ చేసారేంటి.. ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని కావ్య ఫోన్ కట్ చేస్తుంది. ఇలా కాదు వెళ్లి నేనే డైరెక్ట్ కావ్యతో మాట్లాడుతానని కావ్య దగ్గరికి రాజ్ వెళ్తుంటే.. యామిని బావ నీకు ఒక సర్ ప్రైజ్ అని తన వెంట తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత మరుసటి రోజు అందరు పెళ్లికి రెడీ అవుతారు. ఈ రాహుల్, రుద్రాణి వస్తే.. మనం ఏం చేసిన అడ్డుపడతారని ఇందిరాదేవి అంటుంది. అందుకే వీళ్ళు రాకుండా నేను చూస్తానని స్వప్న అంటుంది. తరువాయి భాగంలో కావ్యని కలవాలని రాజ్ వెళ్తుంటే.. ఎక్కడికి అని యామిని అడుగుతుంది. అప్పుడే కావ్య ఫ్యామిలీతో ఎంట్రీ ఇస్తుంది. నేనే పిలిచానని రాజ్ తో యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



