బిగ్ బాస్ హౌస్ లోకి ఫోక్ డాన్సర్ ఎంట్రీ....
on Sep 5, 2025

బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు అంటూ చాలా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే రీసెంట్ గా నాగ దుర్గ పేరు కూడా బాగా పాపులర్ అయ్యింది. నాగ దుర్గ బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తోంది అన్నారు కానీ ఇప్పుడు నాగ దుర్గా మాత్రం తన సైడ్ నుంచి నో అంది. "దారిపొంటోత్తున్నాడు" అనే డిజె సాంగ్ తో నాగదుర్గా ఎంతో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి నాగ దుర్గ "గైస్ ఈ విషయాన్నీ అంత పెద్దది చేయకండి..ఇక మిమ్మల్ని మరింత వెయిట్ చేయించాలని అనుకోవడం లేదు. నేను బిగ్ బాస్ సీజన్ 9 లో లేను.

ప్రస్తుతానికి బిగ్ బాస్ కి వెళ్లే ఇంటరెస్ట్ లేదు. నేను బిగ్ బాస్ కి వెళ్లడం లేదు. రూమర్స్ ని ఎంకరేజ్ చేయకండి." అని చెప్పింది. ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఒక డాన్సర్, ఒక సింగర్ కచ్చితంగా వెళ్తూ ఉంటారు. ఐతే ఈ సారి ఫోక్ సింగర్ నాగ దుర్గ వెళ్తుంది అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె వెళ్లడం అని తేల్చేసింది. నల్గొండకు చెందిన నాగదుర్గా కరోనా టైం నుంచి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. తన వెరైటీ డాన్స్ తో గెటప్స్ తో సాంగ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది . తిన్నా తీరం పడుటలే అనే పల్లె పాటకు 129 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



