Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్-9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ వీళ్ళే!
on Sep 5, 2025

బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్-9 లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరు.. కామనర్స్ ఎవరు.. సెలెబ్రిటీస్ ఎవరు.. అసలు టాస్క్ లు ఏంటి.. ఇలా ఎన్నో ప్రశ్నలతో బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్-9 లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కోసం అగ్నిపరీక్ష మొదలెట్టగా వారిలో నుండి కొంతమందిని ఫిల్టర్ చేశారు బిబి టీమ్. మరి కామనర్స్ తో పాటు హౌస్ లోకి వెళ్ళేదెవరో ఓ సారి చూసేద్దాం.. ఇమ్మాన్యుయల్, సింగర్ శ్రీతేజ, సంజనా గల్రాని, రీతు చౌదరి, భరణి, సుమన్ శెట్టి, తనూజ, దెబ్జానీ, ఆశా షైనీ, స్రష్టి వర్మ, రాము రాథోడ్ కన్ఫమ్ కంటెస్టెంట్స్ అని తెలుస్తోంది. ఇక కామనర్స్ నుండి ఎవరు వస్తారోనని క్యూరియాసిటి అందరిలో నెలకొంది.

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేయబోతున్నాడు. ఇక హౌస్ లోకి ఎంతమంది కంటెస్టెంట్స్ వెళ్తారు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయా.. ఓల్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా హౌస్ లోకి వెళ్తారా లేదా అసలు ఈ సీజన్-9 లో ఎవరు బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు వాటన్నింటికి జవాబులు కావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



