యోగా పాఠాలు.. యష్‌ని ఓ ఆట ఆడుకున్న వేద!
on Nov 28, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. `స్టార్ మా`లో ఇటీవలే కొత్తగా మొదలైన ఈ సీరియల్ టేకింగ్, మేకింగ్, కంటెంట్ పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. యశోధర్, వేదల ప్రేమకథ నేపథ్యంలో ఈ సీరియల్ కథ సాగుతోంది. వేదగా కోల్‌కతాకి చెందిన దేబ్‌జానీ మోడక్ నటిస్తుండగా.., యశోధర్‌గా కీలక పాత్రలో నిరంజన్ నటిస్తున్నాడు. గిల్లికజ్జాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సీరియల్ సాగుతోంది.
వేదని అనవసరంగా అపార్థం చేసుకున్న యశోధర్ ఆమెని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో వేద అతన్ని ఓ ఆట ఆడుకుంటుంది. అనవసరంగా వేదపై కిడ్నాప్ నిందమోపానని ఫీలవుతున్న యశోధర్.. వేదకు దగ్గరకావాలని, ఆమెకు సారీ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ముందు అహం అడ్డు రావడంతో వేదని దూరం పెట్టాలనుకుంటాడు. కానీ ఖుషీ తో పాటు అతని సోదరుడు కూడా వేదకు సారీ చెప్పమనడంతో తను చేసిన తప్పుకి సారీ చెప్పాలనుకుంటాడు.
Also read: `కార్తీకదీపం` : మోనితపైకి చీపుర్లెత్తిన బస్తీ జనం!
ఈ క్రమంలో వేద .. యష్‌ని ఎలా ఆడుకుంది? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేద యోగా క్లాస్‌కి వెళ్లడంతో అక్కడికే వచ్చేస్తాడు యష్. తను కూడా యోగా చేస్తానని చెబుతాడు. తనకు నేర్పమంటాడు. అయితే అందుకు యోగా టీజర్ తనకు పని వుందని, వేద మీకు నేర్పిస్తుందని చెబుతుంది. లేదు లేదు మీరే నేర్పంచాలంటాడు యశోధర్. కానీ యోగాటీచర్ మాత్రం యష్‌ని వేదకు అప్పగిస్తుంది. చేసేది లేక వేద దగ్గర యోగా పాఠాలు నేర్చుకోవడం మొదలుపెడతాడు యష్ .. ఆ క్రమంలో అతని రెండు చేతులు వెనక్కి వీపుకి ఫిక్సయిపోతాయి. ఇదే అదనుగా భావించి వేద .. యష్ ని ఓ ఆట ఆడుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. అన్నది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
