దీప్తి హింట్ ఇచ్చిన వీడియో వైరల్!
on Dec 22, 2021

బుల్లితెర రియాలీటీ షో ముగిసినా ఇది చేసిన రచ్చకు మాత్రం ఇంకా తెరపడటం లేదు. సీజన్ 5 విన్నర్ గా వీజే పసన్ని నిలిచిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫనాలే ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా దీనిపై నెట్టింట చర్చ కొనసాగుతూనే వుంది. అప్నా టైమ్ ఆయేగా.. కప్పు ముఖ్యం బిగులూ.. కళావతి అడిగింది అమ్మకు కప్పు ఇవ్వాల్సిందే మచ్చా.. అంటూ సన్నీ హౌస్ లో చేసిన రచ్చని ఫైనల్ లో నిజం చేశారు అతని అభిమానులు.
అయితే షో స్టారింగ్ నుంచి ఈ సీజన్ విన్నర్ షన్ను అంటూ అతని అభిమానులు ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారాన్ని, యూట్యూబర్ గా అతనికున్న ఫాలోయింగ్‌ని చూసి ఈ సీజన్ విన్నర్ ఇతనే అని అంతా భావించడం మొదలుపెట్టారు. ప్రతీ సారి నామినేషన్స్‌లో వుంటూ వచ్చిన షన్ను సేఫ్ గా బయటపడుతూ వచ్చాడు. దీంతో ఇతనే విన్నర్ అన్నది మరింత బలంగా ప్రచారం కావడం మొదలైంది. అయితే సరితో చేసిన రచ్చ కారణంగా రేసులో వెనకబడిన షన్ను టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో నిలిచి షాకిచ్చాడు.
అయితే ఇది తాను ముందే ఊహించానని, 11 వ వారంలోనే సన్నీ ఈ సీజన్ విజేత అని గ్రహించానని అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో షన్ను బయటపెట్టాడు. అయితే ఇదే సందర్భంగా హౌస్ లోకి వచ్చిన దీప్తి తను రెండవ స్థానానికి పడిపోతున్నాడని రెండు వేళ్లతో మైక్ పట్టుకుని హింట్ ఇచ్చిందని ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన షన్ను మా అమ్మ మీద ఒట్టు నాకు ఆ విషయం తెలియదని చెప్పుకొచ్చాడు.
అయినా దీప్తి అలా చెప్పి ఉండదు. ఒకవేళ నిజంగానే తను అలా చెప్పి వుంటే సిరితో ఎందుకు కంటిన్యూ అవుతా.. నా నా పొజిషన్ గురించి నాకు ముందే తెలుసు. 11వ వారంలోనే సన్నీ విజేత అని గ్రహించాను` అని షాకిచ్చాడు. తను చెప్పానంటూ వైరల్ గా మారిన వీడియోపై దీప్తి వివరణ ఇచ్చినా నెట్టింట ఆమెని, షన్నుని నెటిజన్స్ ట్రోల్ చేయడం మాత్రం ఆపడం లేదు. ఆ వీడియో మీరూ చూసేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



