ఇనయా అవుట్.. కంటెస్టెంట్స్ షాక్!
on Dec 11, 2022
.webp)
బిగ్ బాస్ హౌస్ లో 'ఉమెన్ ఆఫ్ ది సీజన్' గా పేరు తెచ్చుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇనయా. అలాంటిది ఆమె ఎలిమినేట్ అయ్యిందంటే హౌస్ మేట్స్ తో పాటు, ఫ్యాన్స్ కూడా నమ్మలేకపోతున్నారు.
ఇనయా మొదటి నుండి తనదైన శైలిలో పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చింది. అయితే మొదటి వారాల్లోనే కొంచెం నోటి దురుసు ఉన్నా కూడా.. వారాలు గడిచేకొద్ది తనలో చాలా మార్పు వచ్చింది. ఎప్పటికప్పుడు ఆటతీరును, మాటతీరును మెరుగుపరుచుకుంటూ తనని తాను 'విన్నర్ మెటీరియల్' గా మార్చుకుంది ఇనయా. అలాంటిది తను ఎలిమినేట్ అవ్వడం అనేది ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు.
ఎలిమినేషన్స్ లో చివరి వరకు ఆదిరెడ్డి, ఇనయా ఉండగా, "ఇనయా యూ ఆర్ ఎలిమినేటెడ్. హౌస్ మేట్స్ కి బై చెప్పేసి వచ్చేయ్" అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక ఒక్కో హౌస్ మేట్ తమ అనుభవాలను పంచుకున్నారు. "బయట కలుద్దాం స్టోరీ లు చెప్పుకుందాం" అని ఆదిరెడ్డి మాట్లాడాడు. "నో రీగ్రేట్స్ ఇనయా" అని రేవంత్ చెప్పగా, "అందరితో మాట్లాడు ఇనయా" అని శ్రీహాన్ చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



