వైరల్ గా మారిన ఇనయా ఎలిమినేషన్.. లక్ష ట్వీట్స్ తో ఫ్యాన్స్ ట్రెండ్!
on Dec 11, 2022

బిగ్ బాస్ సీజన్-6 ఇన్ని వారాల్లో ఎన్నడూ లేనంత క్రేజ్ ని, పాపులారిటీని ఓవర్ నైట్ లో సంపాదించుకుంది.
అది కూడా ఇనయా ఎలిమినేషన్ అని తెలిసిన ఒక్క రోజులోనే ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట కొచ్చి రచ్చ రచ్చ చేసారు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే.. కామన్ గా సీజన్ మొదటి వారం నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది, ఒక రోజు ముందే తెలిసిపోతుంది. అలాగే ఓ వారం ఇనయా ఎలిమినేట్ అవుతుందని శనివారం ఉదయమే న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో ఇనయాకు సపోర్ట్ చేస్తూ, మొదటి నుండి తనకి ఓట్లు వేసిన ఫ్యాన్స్ స్టూడియో బయటకొచ్చి ధర్మా చేసారు. "అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఇనయా" అంటూ ప్లకార్డులతో భారీగా జనాలు వచ్చి, అరవడంతో పోలీసులు వచ్చి జోక్యం చేసుకొని అభిమానులని చెదరగొట్టారు.
ట్విట్టర్ లో 'అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఇనయా' అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. "ఫేక్ ఎలిమినేషన్, బిబి పాలిటిక్స్, మేనేజ్మెంట్ కోటాలో తొలగించారు" అంటూ ట్వీట్స్ తో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఇప్పుడు అదే ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ ని సవాల్ చేస్తూ, తమ నిరసనని తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇనయా వల్ల బిగ్ బాస్ సీజన్-6 కూడా పాపులర్ అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



