ఇప్పటికి నా బాధ అర్ధమయ్యింది ...చిన్మయి కామెంట్స్ వైరల్
on Sep 21, 2023
సింగర్ చిన్మయి అంటే చాలు ఇండస్ట్రీలో రెవల్యూషన్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా చెప్పుకుంటారు. ఆమె చేసే మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ గురించి అందరికీ తెలిసిందే. వైరముత్తు మీద ఆమె ఒకప్పుడు చేసిన ఆరోపణలు కోలీవుడ్‌ను షేక్ చేసేసిన విషయం తెలిసిందే. వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆమె చేసిన హాట్ కామెంట్స్ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వాటికి ప్రూఫ్స్ అనేవి లేవు...ఉండవు కూడా.
కానీ ఆమె అంత ధైర్యంగా చేసిన కామెంట్స్ తో ఆమెకు సపోర్ట్ గా కొంతమంది బయటకు వచ్చి వైరముత్తు స్వరూపాన్ని చూపించడానికి ట్రై చేసారు కానీ అతని బ్యాక్ గ్రౌండ్ వల్ల వాళ్ళ ఆరోపణలు అన్ని కూడా గాల్లోనే కలిసిపోయాయి. వైరముత్తు మీద చేసిన ఆరోపణల వలన కోలీవుడ్‌లో చిన్మయిని బ్యాన్ చేశారు. డబ్బింగ్ చెప్పడానికి సాంగ్స్ పాడడానికి ఆమెకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. కానీ చిన్మయి వీటిని పెద్దగా పట్టించుకోలేదు. తన దారిలో తాను ప్రశ్నిస్తూనే వెళ్ళింది. ఐతే రీసెంట్ గా వైరముత్తుకు సంబంధించిన ఓ రీల్ వీడియో వైరల్ అవుతోంది.
అందులో ఒక సింగర్ సీరియస్ గా సాంగ్ పాడుతుంటే "మీ నవ్వు బాగుంది" అంటూ పక్కనే ఉన్న వైరముత్తు కామెంట్ చేశారు. ఈ వీడియోని టాగ్ చేసి స్పందించింది చిన్మయి. "ఆయన చేసిన కామెంట్ కి ఆమె చాలా ఇబ్బంది పడిందన్న విషయం చూసే వాళ్లందరికీ తెలుసు..ఐనా ఆమె మాత్రం పెద్దగా రెస్పాండ్ కాకుండా తన పాట పాడుకుంటూ వెళ్ళింది" అని చెప్పింది. "ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఒకప్పటి నా బాధ అందరికీ అర్థం అవుతుంది.. మీటూ ఉద్యమం గురించి తెలియని వాళ్లు చాలా మాట్లాడారు.. నిజం బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది.
నేను మాత్రం బాధితులకు సపోర్ట్‌గా నిలబడతాను.. అవతలి ఉన్నది ఎవరైనా పట్టించుకోను.. నేనేమీ బుద్దుడి టైపు కాదు.. అయితే ఏదో ఒక రోజు నేను బుద్దుడి టైపే ఉండాలనుకుంటున్నా.. మంచి చెడులు లేవు.. అందరూ సమానమే అనే ఆలోచనలు రావాలి.. నేను ఇలానే ఉంటాను.. బాధితుల తరుపున పోరాడతాను.. నన్ను ఏం అన్నారో.. ఎలా అన్నారో అన్నీ గుర్తు పెట్టుకున్నాను.. అందులో సో కాల్డ్ ఫెమినిస్టులున్నారు.. సో కాల్డ్ ప్రోగ్రెసివ్, సో కాల్డ్ ఉమెన్ రైట్స్ పర్సన్స్ ఉన్నారు.. నాకు సహనం, ఓపిక ఉన్నాయి. నేను వెయిట్ చేస్తాను.." అంటూ చిన్మయి తన వెర్షన్ మొత్తాన్ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
