మలేషియాలో ఫస్ట్ వ్లాగ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
on Sep 21, 2023
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా మలేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేసింది. తాజాగా మలేషియా ట్విన్ టవర్స్ ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మలేషియా వెళ్లి అక్కడి తీసిన ఫస్ట్ వీడియోని అంటూ యూట్యూబ్ లో అప్ డేట్ చేసింది. ట్విన్ టవర్స్ ని చూడడానికే మలేషియా వెళ్లినట్లు చెప్పింది..కార్ లో వెళ్తూ మొత్తాన్ని వీడియో తీసింది.
ఇక ఇనాయ ఫ్రెండ్ ట్విన్ టవర్స్ ప్లేస్ ని చూసి హైదరాబాద్ కూడా ఇలాగే డెవలప్ కావాలి అని మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి అలాగే ఫొటోస్ దిగాలి అంటూ కోరుకునేసరికి హైదరాబాద్ గవర్నమెంట్ వినిపిస్తోందా అంటూ ఇనాయ కామెడీ చేసింది. ఇక అలా వెళుతూ మలేషియాలోని టాలెస్ట్ బిల్డింగ్ ని చూపించింది అందులో 116 ఫ్లోర్స్ ఉంటాయని చెప్పింది. స్ట్రీట్ ఫుడ్ కార్నర్ కి వెళ్లారు వెరైటీ ఫుడ్ తినడానికి...అక్కడ ఇనాయ తనకు ఎంతో ఇష్టమైన పనస తొనలు తీసుకుంది. తర్వాత తమతో వచ్చిన బర్త్ డే బాయ్ కి షూస్ కొనడానికి అన్ని షాప్స్ కి వెళ్లారు. చివరికి ఒక మాల్ లో ఆ పిల్లాడికి కావాల్సినవి తీసుకున్నారు.
అలా చివరికి ఇండియన్ ఫుడ్ తినడానికి వెళ్లి అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ చీకట్లో ఒకసారి ట్విన్ టవర్స్ ని చూపించి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది ఇనాయ సుల్తానా. తెలుగులో ‘బుజ్జి ఇలా రా, నటరత్నాలు… యద్భావం తద్భవతి వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమెకు ఒక్క హిట్ కూడా పడలేదు. సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఇనాయ బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
