Brahmamudi: మినిస్టర్ కి రాజ్ వార్నింగ్.. రుద్రాణి ప్లాన్ ఏంటి?
on Feb 3, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -945 లో.... కావ్య, రాజ్ ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. తులసి పాపతో వస్తుంది. తులసి, కావ్య మాట్లాడుకుంటారు. అప్పుడే తులసి దగ్గరున్న పాప ఏడుస్తుంది. అయ్యో ఎందుకు ఏడుస్తుందని కావ్య అడుగుతుంది. పాపకి పాలు సరిపోవడం లేదని తులసి చెప్పగానే.. మీరు ఏం అనుకోకపోతే పాపకి నేను పాలు పట్టొచ్చా అని అడుగుతుంది. పర్లేదు పట్టొచ్చు అని డాక్టర్ అనగానే తులసి సరే అని పాపని కావ్యకి ఇస్తుంది.
పాపని రూమ్ లోకి తీసుకొని వెళ్లి పాలు పడుతుంది కావ్య. తన కన్నబిడ్డని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది కావ్య. కావ్యని చూసి రాజ్ బాధపడుతాడు. కావ్య పాపని తీసుకొని వస్తుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మొన్న పాప ఏడుస్తుంటే పాట పాడారు.. ఇప్పుడు పాపకి పాలు పట్టి ఆకలి తీర్చారని తులసి అంటుంది. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రండి.. మీరు పాపని వెతుకుతున్నారు కదా.. ఆ విషయంలో మా ఆయన హెల్ప్ చేస్తాడని తులసి అంటుంది. పాపని ఇవ్వడానికి కావ్య ఇబ్బంది పడుతుంది. అయినా సరే తప్పక తన పాపని తులసికి ఇస్తుంది కావ్య.
మరొకవైపు అపర్ణ, ఇందిరాదేవి కలిసి పంతులిని పిలిపించి పాప జాతకం చూడమని చెప్తారు. పాప జాతకం చాలా బాగుందని పంతులు చెప్తాడు. అప్పుడే రేఖ అక్కడికి వస్తుంది. వాళ్ళు బారసాల గురించి మాట్లాడుకుంటుంటే.. కావ్య అసలు తన బిడ్డ కాదని అంటుంటే బారసాల అంటున్నారా అని రేఖ అంటుంది. ఎప్పుడు ఎందుకు ఏదో ఒకటి మాట్లాడుతావని తనపై కోప్పడుతుంది ఇందిరాదేవి.
మరొకవైపు మినిస్టర్, రుద్రాణి మాట్లాడుకుంటుంటే అప్పుడే రాజ్, కావ్య రావడం గమనించి రుద్రాణి దాక్కుంటుంది. రాజ్, కావ్య వచ్చి మినిస్టర్ తో మాట్లాడుతారు. అప్పుడే తులసి వస్తుంది. వాళ్ళకి హెల్ప్ చెయ్యండి.. వాళ్ళ పాపని వాళ్ళ దగ్గరికి చేర్చండి అని తులసి అనగానే సరే అని తనని లోపలికి పంపిస్తాడు. మా బిడ్డని మాకు ఇచ్చేయ్ అని మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



