Karthika Deepam2 : జ్యోత్స్నని బెదిరించిన కార్తీక్.. బర్త్ డే కేక్ పై ఇద్దరి పేర్లు!
on Jun 13, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -382 లో.. దీపని కార్తీక్ నిద్ర నుండి లేపి కేక్ తో సర్ ప్రైజ్ చేస్తాడు. దీప కేక్ కట్ చేసి కార్తీక్ కి తినిపిస్తుంది. మరుసటి రోజు జ్యోత్స్న రెడీ అవుతుంది. పదా కింద మీ అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని పారిజాతం వస్తుంది. అలా కొద్దీ సేపు వెయిట్ చేయనివ్వు.. అప్పుడే వాళ్ళకి నా విలువ తెలుస్తుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప జ్యోత్స్న బర్త్ డే కోసం డెకరేషన్ చేస్తుంది.
వెళ్లి సుమిత్ర అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కార్తీక్ అనగానే దీప వెళ్లి ఆశీర్వాదం తీసుకుందామని వెళ్తుంటే సుమిత్ర వెనక్కి వెళ్తుంది. దాంతో దీప బాధపడుతుంది. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఎంట్రీ ఇస్తారు. అమ్మ నాన్న నిన్న మిమ్మల్ని బాధపెట్టాను.. దీప నీకు కూడా సారీ అని జ్యోత్స్న అనగానే అబ్బా ఏం నటిస్తున్నావని కార్తీక్ అనుకుంటాడు. ఇప్పుడు దీప నేను కేక్ కట్ చేస్తామని జ్యోత్స్న బలవంతంగా దీపని తీసుకొని వెళ్తుంటే పారిజాతం పక్క నుండి కేక్ కింద పడేస్తుంది. అది చూసి దీప పడేసిందని అందరు దీపపై కోప్పడతారు. ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ ఇలా చెయ్యడం ఏంటి దీప అని పారిజాతం కోప్పడుతుంది. నాకు ఈ బర్త్డే సెలెబ్రేషన్స్ చేసుకోవడం ఇష్టం లేదని జ్యోత్స్న పైకి వెళ్తుంది.ఇప్పుడు ఏం అంటావ్ రా అని కార్తీక్ తో సుమిత్ర అంటుంది. నేను వెళ్లి జ్యోత్స్న ని తీసుకొని వస్తానని జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్. పారిజాతం కేక్ కింద పడేసిన వీడియోని జ్యోత్స్నకి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు కిందకి రాకుంటే ఈ వీడియో చూపిస్తానని కార్తీక్ అనగానే జ్యోత్స్న వద్దని భయపడి కిందకి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కేక్ లేదు కదా అని పారిజాతం అనగానే.. కార్తీక్ చిటికె వెయ్యగానే డెలివరీ బాయ్ కేక్ తీసుకొని వస్తాడు. కేక్ పై జ్యోత్స్న, దీప అని రాసి ఉంటుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
