బిగ్ బాస్ 5: లహరి ఎలిమినేషన్ అనూహ్యం!
on Sep 27, 2021
.jpg)
'బిగ్ బాస్'లో మూడో వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా కొనసాగింది. వీక్షకులు, విశ్లేషకుల ఊహలకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. హౌస్ నుండి అందగత్తే లహరి బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.
లహరితో పాటు సింగర్ శ్రీరామ్, యాక్టర్ మానస్, ఫిమేల్ ఆర్టిస్ట్ ప్రియా, ప్రియాంక సింగ్ మూడో వారం నామినేషన్లలో ఉన్నారు. ప్రియాంక సింగ్ లేదా ప్రియా... ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. బిగ్ బాస్ ఇంటిలో సభ్యులు సైతం అదే అనుకున్నారు. అయితే అనూహ్యంగా లహరి ఎలిమినేట్ అయింది.
శనివారమే శ్రీరామ్, ప్రియాంక సింగ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున తెలిపారు. మిగతా ముగ్గురిలో ప్రియా బయటకు రావచ్చునని అనుకుంటే... లహరి వచ్చింది. ఆమె అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆట పరంగానూ లహరి ఆకట్టుకున్నారు. ఓటింగ్ లో మిగతా వాళ్ళ కంటే వెనుక పడడంతో ఎలిమినేట్ కాక తప్పలేదు. లహరి, ప్రియా, రవి మధ్య మూడవ వారం జరిగిన గేమ్ చూస్తే... కొన్ని రోజుల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా లహరి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



