ఆధ్యాత్మిక యాత్రలో అందగత్తె మోనాల్!
on Sep 25, 2021

'బిగ్ బాస్ 4'కు వెళ్ళడానికి ముందు, వెళ్లొచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకు అందాల ఆడబొమ్మగా మోనాల్ గజ్జర్ కనిపించింది. షోలో కూడా గ్లామర్ ఒలకబోసింది. షో తర్వాత 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేసింది. సినిమాల్లో మోడ్రన్ డ్రస్సుల్లో ఎంత గ్లామర్‌గా కనిపించినప్పటికీ... మోనాల్ పక్కా ట్రెడిషనల్ అమ్మాయి. ఆమెకు దైవభక్తి ఎక్కువ.
ప్రస్తుతం మోనాల్ గజ్జర్ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నది. ఢిల్లీలో అక్షరధామ్ కు వెళ్లిన ఈ అందగత్తె అక్కడ అభిషేకం చేయించుకుంది. స్వయంగా పూజలో పాల్గొంది. శనివారం హరిద్వార్, రిషికేష్ బయలు దేరింది. మరో రెండు మూడు రోజులు అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకున్నదట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే ఫ్లైట్ జర్నీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్లైట్ లేదంటే కారులో వెళతారు. కానీ, మోనాల్ గజ్జర్ ఢిల్లీ నుండి హరిద్వార్ ట్రైన్ కి వెళ్లడం విశేషం. రైల్వే స్టేషన్ నుండి హోటల్ వరకు కారులో వెళ్లారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



