వైష్ణవిని, యుతిని తనదైన స్టయిల్లో ఇన్వైట్ చేసిన బాలయ్య
on Mar 19, 2023
ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో పోటీ పడుతున్న సింగర్స్ ని ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేసే ఒక కొత్త సంస్కృతికి రూపం ఇచ్చింది ఆహా టీమ్. దానికి 'గాల విత్ బాల' పేరు పెట్టి నందమూరి బాలకృష్ణతో పరిచయ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. బాలయ్య టాప్ 12 సింగింగ్ కంటెస్టెంట్స్ ని తనదైన స్టయిల్లో ఇంట్రడ్యూస్ చేశారు.
'గాల విత్ బాల' షోలో ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఇన్వైట్ చేశారు బాలయ్య బాబు. "తాను డబ్బింగ్ లో డీజే.. చాటింగ్ లో ఆర్జే.. సింగింగ్ శివాజీ.. వైష్ణవి...ఓ వైష్ణవి..నువ్వు నడిచొచ్చే కాన్ఫిడెన్సువి" అంటూ బాలయ్య సింగర్ వైష్ణవిని స్టేజి మీదకు ఇన్వైట్ చేశారు. "హోయారే..హోయా..ముద్దులా మావయ్య" అంటూ స్టేజి మీద సాంగ్ పాడి ఓ రేంజ్ లో అలరించింది వైష్ణవి. "బాలయ్య గారి ముందు ఈ సాంగ్ పాడడం నిజంగా అమేజింగ్" అన్నారు థమన్. "అసలు కుమ్మేసావ్ అనుకో" అని గీతా మాధురి కామెంట్ చేసింది. "ఒక్కసారి మనం కాన్ఫిడెంట్ గా ఉంటే వి విల్ బికం అన్ స్టాపబుల్" అన్నారు బాలయ్య.
ఇక "బెంగళూరు బాలిక...సిగ్గులోన గోపిక..కార్తిక్ బ్రో కనిబడితే ఆపలేము తననిక..యుతి..ఓ యుతి..ఏందమ్మా నీ ఫాన్స్ గతి" అంటూ బాలకృష్ణ తనదైన స్టయిల్లో యుతిని స్టేజి మీదకు ఇన్వైట్ చేశారు. "బూచాడే..బూచాడే" అనే సాంగ్ పాడింది యుతి. ఇంకా ఆమె పెర్ఫార్మెన్స్ కి కార్తీక్ ఫిదా ఐపోయాడు.."ఫెంటాస్టిక్..ఫినామినల్ పెర్ఫామెన్స్..మైండ్ బ్లోయింగ్" అంటూ ప్రశంసల వర్షం కురిపించేసాడు. ఇక థమన్ "బూమ్ భద్దల్ పెర్ఫార్మెన్స్" అంటూ పొగిడేశారు. ఇక బాలకృష్ణ ఐతే "నీకు మంచి ఫ్యూచర్ ఉంది" అంటూ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
