కృష్ణభగవాన్ కి ముద్దు పెట్టిన యాంకర్ సౌమ్యరావు!
on Mar 19, 2023
ఒకప్పుడు జబర్దస్త్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే రోజులుండేవి. కానీ కొంతకాలం నుంచి ఈ షోలో చాలా మార్పులు వచ్చాయి. నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, అనసూయ ఉన్నప్పుడు అది ఫుల్ జోష్ తో ఉండేది. కానీ ఇప్పుడు ఈ షోలో ఎంత వెతికినా జోష్ కనిపించడం లేదు. ఇక హైపర్ ఆదికి సినిమాల్లో ఛాన్సులు వచ్చేసరికి ఈ షోలో అప్పుడప్పుడు అలా మెరిసి మాయమవుతున్నాడు. ఇప్పుడు కొత్త యాంకర్, కొత్త కమెడియన్స్ తో షో రేటింగ్ తగ్గిపోయింది. మరి ఏమనుకున్నారో ఏమో కానీ షోలో కొత్త కొత్త మార్పులను తీసుకొస్తున్నారు. ఇక కొత్త యాంకర్.. జడ్జి కృష్ణ భగవాన్ చేతి మీద ముద్దు పెడుతూ కనిపించింది కొత్త ఎపిసోడ్ లో. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
రాబోయే ఎపిసోడ్ లో నూకరాజు స్కిట్ లో భాగంగా సౌమ్యరావుతో ఒక ఛాలెంజ్ చేసాడు. తాను చేసే ప్రతీపని చేయాలనీ యాంకర్ సౌమ్యరావుకి చెప్పాడు. అలా నూకరాజు వెళ్లి కృష్ణ భగవాన్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. వెంటనే సౌమ్య రావు కూడా వచ్చి కృష్ణ భగవాన్ బుగ్గ మీద ముద్దు పెట్టబోయింది. కానీ వెంటనే పక్కనే ఉన్న మరో లేడీ జడ్జి ఇంద్రజ అడ్డుపడింది. దాంతో ఆయన బుగ్గ మీద పెట్టాల్సిన ముద్దును ఆయన చేతి మీద పెట్టింది. అందరూ షాకవడమే కాదు గట్టిగా నవ్వేశారు.
ఐతే ఈ షోకి మరింత టీఆర్పీ కోసం ఇలాంటి స్క్రిప్టెడ్ సీన్స్ పెట్టి ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేస్తున్నారు యాజమాన్యం. ఈ ఎపిసోడ్ ప్రోమోకి ఫాన్స్, నెటిజన్స్ నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి." టీం లీడర్స్ కన్నా జడ్జ్ లు వేసే పంచ్ లే నవ్వును తెప్పిస్తున్నాయి.. ఒక్కప్పటి జబర్దస్త్ కి ఇప్పటి జబర్దస్త్ కి చాలా తేడా ఉంది" అంటున్నారు. ఆర్పీ, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి లాంటి సీనియర్ కమెడియన్స్ ఇప్పుడు లేకపోవడం అంతా కొత్తవాళ్లే కావడంతో కామెడీ కూడా కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
