బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు జంట సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది
on Jul 31, 2025
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం రాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే ని పురస్కరించుకుని ఈ షోకి వచ్చిన వాళ్లంతా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారు. ఇక ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే అది బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు ఫ్రెండ్ షిప్ గురించే. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అంటూ ఒక ఉదాహరణగా కూడా చూపిస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు ఆ స్నేహితుల్లో కోట గారు బాబు మోహన్ గారిని వదిలేసి వెళ్లిపోయారు. దాంతో ఆయన స్నేహితుడు లేని ఒంటరి మనిషిగా ఉన్నారు. అలాంటి ఆయన ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వచ్చారు.
ఇక శ్రీముఖి ఐతే "నా బెస్ట్ ఫ్రెండ్ బాబు మోహన్ గారు వచ్చారు" అంటూ ఇన్వైట్ చేసింది. అలా అందరూ లేచి ఆయన చుట్టూచేరి "ముస్తఫా ముస్తఫా" సాంగ్ కి డాన్స్ చేశారు. కోట శ్రీనివాసు రావు గారితో బాబు మోహన్ ఉన్న ఫోటోని ఆయనకు గిఫ్ట్ చేశారు. "కోటన్నా మళ్ళీ నటుడిగా పుట్టి తీరతాడు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "బాపు రమణల స్నేహం గురించి మన తెలుగు వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు గారి స్నేహం కూడా శాశ్వతంగా సువర్ణాక్షరాలతో అలా ఈ సినిమా చరిత్రలో లిఖించబడుతుంది అని ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నా" అంటూ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ నాలుగు మంచి మాటలు చెప్పారు. ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ . సుత్తి - వీరభద్రరావు, బాపు-రమణ, కోట-బాబూమోహన్ ఇలా కొన్ని జంటలు ఉన్నాయి..వాళ్ళు ఎప్పటికీ చరిత్రలో అలా నిలిచిపోతారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



