మేము పెడితే కూత కాదు కోతే..
on Jul 31, 2025
.webp)
డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో చిన్నారులంతా కలిసి ధర్నా చేస్తూ ఉంటారు. "మొగుడ్స్ వెర్సెస్ పెళ్లామ్స్" అనే కాన్సెప్ట్ లో పిల్లలు అంతా కూడా ఒక మగాడు హ్యాపీగా ఉండాలంటే ఎం చేయాలి అనుకుంటూ ఉంటారు. దానికి ఆన్సర్ ని అనిల్ రావిపూడి ఇచ్చారు. "మూడు తప్పులు చేయకూడదు..లవర్ మ్యారేజ్ , అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు.. ఫైనల్ గా అసలు పెళ్లి చేసుకోకూడదు" అన్నారు. ఆడపిల్లలంతా ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలి అని అడుగుతూ మగపిల్లలేమో వారంలో ఒక్కరోజైనా మాకు మనఃశాంతి కావాలి అంటూ ధర్నాలు చేస్తూ ఉంటారు. "ఇది తేలే విషయం కాదు కానీ రెండు టీమ్స్ మధ్య కబడ్డీ పెడదాం" అని చెప్పారు అనిల్ రావిపూడి. ఆడోళ్ళు గెలిస్తే ఆదివారం ఆడవాళ్లకు సెలవు మగవాళ్ళు గెలిస్తే వాళ్ళు అడిగినట్టు వారంలో ఒక రోజు మనఃశాంతి అన్నారు.
"మనఃశాంతి కోసం మరణానికి సిద్ధం" అంటూ మగపిల్లలు కూత పెడుతూ ఉంటె "దమ్ముంటే పట్టుకోరా నా మొగుడా " అంటూ ఆడపిల్లలు కూత పెట్టారు. ఇక ఫైనల్ గా అనిల్ రావిపూడి, రోజా కబడ్డీ రింగ్ లోకి ఎంటర్ అయ్యారు. మగవాళ్ళు చీటింగ్ చేస్తున్నారు అన్నారు రోజా. దానికి సుధీర్ "కూతకు మీరు వెళ్తారా వాళ్ళను రమ్మంటారా" అని అడిగాడు. రోజా మాత్రం ఫుల్ జోష్ తో ఆన్సర్ ఇచ్చింది. "మేము పెడితే అది కూత కాదు కోతే" అన్నారు. "ఆవిడ ఊపు చూస్తే అది కోత లాగే ఉంది" అన్నారు అనిల్ రావిపూడి అన్నారు. తర్వాత రోజా "మనఃశాంతి కావాలా మరణం కావాలా" అంటూ కూత పెట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



