అప్పుడు అనసూయ.. ఇప్పుడు అరియానా... ఏమిటీ రచ్చ!
on Sep 30, 2023
ఏంటి ఇంత లావు అయ్యావ్? ఆంటీలా తయారయ్యావని ఒకడు కామెంట్ చేశాడంటూ అరియానా తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకుంది. కొంతమంది పనికిమాలిన వాళ్ళున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నానంటూ అరియాన రెచ్చిపోయింది. అసలేమైంది. తను ఎందుకు అంతలా రెచ్చిపోయిందంటే రీసెంట్ గా అరియానా ఒక ప్రోగ్రామ్ కోసం ఇతర దేశాలకి వెళ్లింది అక్కడ తన ఫ్రెండ్స్ తో సరదాగా గడిపి ఈ మధ్యే ఇండియాకి వచ్చిన అరియానా కొత్త వ్లాగ్స్, రీల్స్, ఫోటోషూట్ లు అప్లోడ్ చేసింది. అయితే ఈ ఫోటోలలో అరియానా కాస్త బొద్దుగా కనిపించింది. అయితే ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేసారు. ఒకరైతే ఏకంగా ఆంటీలా ఉన్నావని అనేశాడు. దాంతో అరియానాకి కోపమొచ్చింది.
అరియానా గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియానా.. అరియానా మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియానా. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియానా చాలా బాధపడింది.
తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ నెడిజన్ తనని ఆంటీలా ఉన్నావని అన్నాడంటూ రియాక్ట్ అయింది. " నేను ఎలా ఉంటే నీకేంటిరా, నేను నా లైఫ్ లో ప్రోగ్రెస్ అవుతున్నాను. నువ్వు అది కూడా లేదు కదా.. నచ్చకపోతే అన్ ఫాలో కొట్టేయ్. ధైర్యముంటే ముందుకొచ్చి మాట్లాడురా.. బ్రెయిన్ హార్ట్ తో ఆలోచించు మాట్లాడురా అదేమీ లేకపోయినా పర్లేదు అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటిరా.. అసలు నీకేంటి రా ప్రాబ్లమ్. ఎవరి లైఫ్ వాళ్ళది.
నువ్వేమైనా మంత్లీ బిల్స్ పే చేస్తున్నావా? మంత్లీ రెంట్ కడుతున్నావా? లేక ఎవరినైనా చేసుకుంటున్నావా" అంటూ అరియానా ఫైర్ అయింది. నిన్న మొన్నటి దాకా అనసూయని నెటిజన్లు ఆంటీ అన్నారని తను ఫీల్ అవ్వగా, ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అరియానా చేరింది. కాగా అరియానా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
