బిగ్ బాస్ ప్రోమో: నాగార్జున చేతిలో బెల్ట్.. అసలు ఏం జరిగింది!
on Sep 30, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని నాల్గవ వారం ముగింపుకి వచ్చేసింది. ఇక వీకెండ్ లో శనివారం రోజు వచ్చే ప్రోమో కోసం ఎంతో మంది చూశారు. హోస్ట్ నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతాడు, ఎవరి మీద ఫైర్ అవుతాడనేదాని కోసం ఇప్పటికే బిగ్ బాస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకులు ఆసక్తరంగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడ అనే శనివారం ప్రోమో రానే వచ్చింది.
ఇక టాస్క్ లో గౌతమ్ కృష్ణని టార్చర్ చేసినందుకు గాను టేస్టీ తేజ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. సంఛాలక్ గా యూ కంప్లీట్లీ ఫెయిల్ సందీప్‌ని అనగానే సందీప్ మొహం వాడిపోయింది. ఇక టేస్టీ తేజని అలా ఎలా లాగుతావంటూ.. నువ్వు చేసింది తప్పేనా అని నాగార్జున అడుగగా.. రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది అంటూనే అవును సర్ అని తన తప్పును ఓప్పుకున్నాడు తేజ. అంతే కాకుండా మీరు నాకు ఏ శిక్ష వేసిన ఒకే సర్ అని టేస్టీ తేజ అన్నాడు. ఇక టేస్టీ తేజని ఏం చేద్దామని ఇక టేస్టీ తేజకి ఏ శిక్ష వేద్దామని కంటెస్టెంట్స్ ని అడుగగా.. జైలుకి పంపించాలని శుభశ్రీ, ప్రియాంక జైన్ అన్నారు. సందీప్ ని అడుగగా.. డైరెక్ట్ గా హౌజ్ లో నుండి బయటకు పంపించేద్దామని అనగానే బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.
టాస్క్ లో టేస్టీ తేజ అలా చేస్తుంటే నువ్వు ఎందుకు చెప్పలేదని శివాజీని నాగార్జున అడిగాడు. నేను చూడలేదని శివాజీ అన్నాడు. ఇక ఒక్కొక్కరి ఆటతీరుని, మాటతీరుని చెప్తూ కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
