కాశీ విశ్వనాథుడి సేవలో తరించిన రష్మీ గౌతమ్
on Jul 10, 2025
.webp)
బుల్లితెర మీద గత పదేళ్లుగా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తున్న రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో సుడిగాలి సుధీర్, రష్మీ కలిసి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ని హోస్ట్ చేసేవాళ్లు. కానీ తర్వాత సుధీర్ మూవీస్ లో ఛాన్సెస్ రావడంతో వెళ్ళిపోయాడు. అలా ఈ రెండు షోస్ ని రష్మీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక రీసెంట్ గా రష్మీకి కో-యాంకర్ గా మానస్ జతయ్యాడు. రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఒక హెల్త్ ఇష్యూని కూడా ఫేస్ చేసింది. ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చింది. దాంతో ఆమె కొంచెం తగ్గిపోయింది కూడా. అలాగే ఇప్పుడు కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె కాశి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్న పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే "కాశీ మనుషులు నిర్మించిన నగరం కాదు.. ఇది దేవతలు కొలువై ఉండే నగరం, శివుని త్రిశూలం అంతా చూసుకుంటుంది.
కాశీ విశ్వనాథుని ఆధ్యాత్మిక విశ్వాసం " అంటూ హరహర మహాదేవ, హరహర గంగే, కాశీవిశ్వనాథ అంటూ హాష్ ట్యాగ్స్ పెట్టింది. నుదిటి మీద త్రిసూలం బొట్టుతో రష్మీ కొత్తగా అందంగా కనిపించింది ఈ పిక్స్ లో . ఇక నెటిజన్స్ ఐతే హరహరమహదేవా, చాలా బాగున్నారు, ఓం నమఃశివాయ, శివ శంభో, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం..." అంటూ విష్ చేస్తున్నారు. ఇక జబర్దస్త్ కి మధ్యలో యాంకర్స్ గా సౌమ్య, సిరి హన్మంత్ వచ్చారు కానీ వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. రష్మీ ఒక్కతే స్టాండర్డ్ గా ఆ షోకి ఫిక్స్ ఐపోయింది. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



