షర్మిల కామెంట్స్ ని గుర్తు చేసుకున్న కౌషల్..
on Jul 10, 2025
.webp)
ఇటీవల రిలీజయిన కన్నప్ప మూవీలో కౌషల్ ఒక మంచి రోల్ లో నటించాడు. కౌషల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. ఆయన కోసం కౌషల్ ఆర్మీ అనేది ఒక ఫార్మ్ కూడా అయ్యింది. ఇదంతా ఏడేళ్ల క్రితం. ఐతే బిగ్ బాస్ తర్వాత కౌషల్ ఫేమ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కన్నప్పతో మళ్ళీ తెరమీద కనిపించాడు. దాంతో ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "బిగ్ బాస్ తర్వాత చాలా ఆఫర్స్ వస్తాయని అనుకున్నా. దాని క్రేజ్ కారణంగా మంచి ఆఫర్స్ దొరుకుతాయని ఊహించా. కానీ రాలేదు. తర్వాత అర్ధమైన విషయం ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ, బిగ్ బాస్ రెండు వేరువేరు అని అర్ధమయ్యింది. అందులో సగం మంది బిగ్ బాస్ షోనే చూడరు. మోహన్ బాబు గారు కూడా బిగ్ బాస్ అనేదే చూడలేదు. షూటింగ్ లొకేషన్స్ లో బిగ్ బాస్ గురించి మమ్మల్ని అడిగి తెలుసుకునే వాళ్ళు. బిగ్ బాస్ అంటే ఏమిటి, ఎం చేస్తారు, ఎలా ఆడతారు అని అడిగేవాళ్ళు. ఆయన లాంటి వాళ్లకు చాలా మందికి కూడా బిగ్ బాస్ గురించి ఏమీ తెలీదు. ఐతే నా సీజన్ లో కౌశల్ ఆర్మీ పేరుతో చాలా హడావిడి జరిగింది కాబట్టి కొంతమందికి బిగ్ బాస్ గురించి తెలిసి ఉండవచ్చు. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చానని ఇండస్ట్రీ పిలిచి అవకాశాలు ఇవ్వాలని కూడా ఏమీ లేదు. ఐతే ఎన్నాళ్ళ నుంచో నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అన్ని రకాల రోల్స్ చేసాను.
దాంతో లీడ్ క్యారక్టర్ ఇవ్వాలి అంటే వాళ్లకు కూడా కష్టమే అయ్యుండొచ్చు. నేను హీరోగా చేస్తానని చెప్పలేదు. లీడ్ రోల్ కూడా అడగలేదు. కానీ ఇచ్చిన రోల్ కి న్యాయం చేస్తాను అని చెప్పా అంతే. బిగ్ బాస్ ఐపోయి ఏడేళ్లు ఐపోతోంది. అప్పట్లో ఇంటర్వ్యూ చేస్తే లక్షల్లో వ్యూస్ వచ్చేవి ఇప్పుడు బిగ్ బాస్ ఫ్లవర్ తగ్గుతూ వస్తుంది దాంతో వేలల్లోనే వ్యూస్ వస్తాయి. ఎవరో అన్నట్టు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టు ఇంటర్వ్యూ అంటే మనం ఏంటో చెప్పేదే. అది కొంతమంది ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కొంతమందికి ఉపయోగపడుతుంది. అలా ఉండాలి లేదంటే ఇంటర్వ్యూస్ చేయడం వేస్ట్" అని చెప్పారు కౌశల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



