దేవుడా ఆడవాళ్ళ సిస్టంని అప్ డేట్ చెయ్యి...
on Jul 17, 2025
.webp)
రష్మీ యాంకర్ గానే కాదు ఏ విషయాన్నీ ఐనా చివరకు మహిళల సమస్యలపైనా కూడా చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతుంది. ఇది మాట్లాడకూడదు అన్నది ఆమెలో కనిపించదు. అలాంటి రష్మీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈరోజు మహిళలు తీవ్రంగా ఎదుర్కుంటున్న సమస్య పీరియడ్స్. దాని మీద అందరూ ఆలోచించదగ్గ ఒక పాయింట్ ని డిఫెరెంట్ వేలో తన అభిప్రాయాన్ని చెప్పింది. "ప్రతీ నెల పీరియడ్స్ మూడు రోజులు ఐదు రోజులు కాకుండా యూరిన్ కి ఎలా వెళ్తామో అలా ఎందుకు రాదు ? ఓ దేవుడా సీరియస్ గా చెప్పాలంటే వాష్ రూమ్ కి ఇలా వెళ్లి అలా వచ్చేసేలా ఎందుకు డిజైన్ చేయలేదు.

అప్పుడు ప్యాడ్స్ , మరకలు, టెన్షన్ లాంటివి లేకుండా ఒక్క ఫ్లష్ తో పీరియడ్స్ ఐపోయే అవకాశం లేదా ? దేవుడా నువ్వు మమ్మల్ని ప్యాడ్స్ చుట్టూ, మరకలతో, కడుపులో నొప్పితో, కప్స్ తో, మూడ్ స్వింగ్స్ తో మా లోపల్లోపల ఒక యుద్ధం జరిగేలా చేస్తున్నావ్. నిజం చెప్పాలంటే..ప్రతీ 28 రోజులకు ఒక అమ్మాయి సర్వైవ్ కావడం చాలా కష్టం..దేవుడా ప్లీజ్ అప్ డేట్ సిస్టం" అంటూ రష్మీ ఒక బాధ లాంటి నిర్వేదంతో ఈ పోస్ట్ ని పెట్టినట్టు తెలుస్తోంది. నిజంగా ఈ రోజున ఆడపిల్లలు మెచ్యూర్ ఐన దగ్గర నుంచి వీటి చుట్టూనే వాళ్ళ మైండ్ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్నీ చాలా సూటిగా, స్పష్టంగా చెప్పింది రష్మీ. రష్మీకి సోషల్ ఇస్స్యూస్ మీద చాలా క్రేజ్ పోస్ట్స్ పెడుతుంది. అవి ఆలోచించే విధంగా ఉంటాయి. ఇక రష్మీ యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమె తెలుగు మాట్లాడే స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



