Brahmamudi : బ్రహ్మముడిలో సూపర్ ట్విస్ట్.. కూతురిని అపర్ణ గెంటేసిందా!
on Jul 18, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -776 లో..... ఇందిరాదేవి కంగారు పడుతుంటే.. అసలు నా దగ్గర ఏం దాస్తున్నారని కావ్య అడుగుతుంది. అసలు ఈ రేవతి ఎవరు ఆవిడకి ఈ ఇంటికి సంబంధం ఏంటని కావ్య అడుగుతుంది. ఇందిరాదేవి చెప్పకపోవడంతో నేను అత్తయ్యని అడుగుతానంటూ కావ్య వెళ్ళబోతుంటే ఇందిరాదేవి ఆపుతుంది. రేవతి ఈ ఇంట్లో మనిషి అని ఇందిరాదేవి అంటుంది అంటుంది. మరి ఏం తప్పు చేసిందని అక్కడ ఉంటుందని కావ్య అంటుంది.
అది చేసింది తప్పు కాదు.. పొరపాటు. రేవతి ఎవరో కాదు అపర్ణ కన్నబిడ్డ అని ఇందిరాదేవి చెప్పగానే కావ్య షాక్ అవుతుంది. ఇందిరాదేవి అసలు ఏం జరిగిందో కావ్యకి చెప్తుంది. రేవతి , రాజ్ ఇద్దరు అపర్ణ పిల్లలు.. రేవతిని చాలా గారాబంగా పెంచారు. ఆ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే జగదీష్ ని లవ్ చేసి ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకొని వస్తుంది రేవతి. వాళ్లని చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు. మీరు నా నిర్ణయాన్ని అంగీకరిస్తారని ఇలా చేసానని రేవతి చెప్తుంది. జగదీశ్ ని సుభాష్ కొడతాడు.
నీకు ఈ ఇంటికి సంబంధం లేదని అపర్ణ ఆ ఇద్దరిని గేంటేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది అక్కడే ఉంది.. మేం ఇక్కడే ఉన్నామని ఇందిరాదేవి చెప్తుంది. తరువాయి భాగంలో శ్రీను వాళ్ల అమ్మకి ఫోన్ చేసాడని రాజ్ కి తెలియడం తో రాజ్ వెళ్తాడు. మరొకవైపు నాకు రాజ్ ని అప్పగించు శ్రీను.. వచ్చి సాక్ష్యం చెప్పేలా చేస్తానని యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



