నీ కోసం ఏమైనా చేస్తా బావ....
on Apr 28, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో ఎలిమినేషన్ రౌండ్ ఉన్న మానస్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ వీక్ చూస్తే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన మానస్ ని అతని కంటెస్టెంట్ ని మళ్ళొకసారి షోనుంచి బయటకు గెంటేస్తాను అన్న మాటలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఆ షో అందరికంటే టాప్ మార్క్స్ గైన్ చేసింది మానస్. ఇక మానస్ కి ఈ గెలుపులో సాయం చేసింది అమర్ దీప్. ప్రాకృతికి మానస్ కి మధ్య స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు మానస్ చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసాడు. 4 ,78 , 140 ఓట్స్ తో మెంటార్ మానస్ అతని కంటెస్టెంట్ చిరాశ్రీ టాప్ లో ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో మెంటర్ ప్రాకృతి ఆమె కంటెస్టెంట్ బర్కత్ ఉన్నారు, ఇక థర్డ్ ప్లేస్ లో దీపికా ఆమె కంటెస్టెంట్ విపుల్ ఉండగా ఫైనల్ ప్లేస్ లో ముమైత్ ఖాన్ ఆమె కంటెస్టెంట్ అన్షికా ఉన్నారు. ఐతే ఇప్పుడు అమర్ దీప్ థ్యాంక్స్ మెసేజ్ పెట్టాడు.
లాస్ట్ వీక్ ఎపిసోడ్ తర్వాత మానస్ ని సపోర్ట్ చేయాలి అంటూ అమర్ దీప్ ఒక వీడియో చేసి పోస్ట్ చేసాడు. అది కాస్తా బాగా వైరల్ అయ్యింది. దాంతో ఇప్పుడు మానస్ టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు. "థ్యాంక్యూ మీ అందరి ప్రేమకు, సపోర్ట్ కి" అన్నాడు అమర్ దీప్. మానస్ - అమర్ దీప్ ఇద్దరూ ఫ్రెండ్ షిప్ కి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం అని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. "మీ వోటింగ్ తో మా బావని అక్కడ నిలబెట్టారు అందరికీ ధన్యవాదాలు. నీ కోసం ఎర ఐనా అవుతా సొర ఐనా అవుతా..నీ ఒక్కడి కోసం నువ్వెప్పుడూ పిలిచినా నేను ఇక్కడికి వస్తా" అనే డైలాగ్ చెప్పాడు అమర్ దీప్. ఇక ఈ నాలుగు టీమ్ లు ప్రీ ఫైనల్ లోకి అడుగుపెట్టాయి. ఐతే నెక్స్ట్ వీక్ విన్నర్ ఎవరు అనేది మాత్రం కొంచెం సస్పెన్సు గానే ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
