బుల్లితెర సౌందర్య బ్రహ్మముడి దీపిక.. నెక్స్ట్ మూవీ వెంకీ మామతో సైన్!
on Apr 27, 2025
బ్రహ్మముడి సీరియల్ తో మానస్ పక్కన దీపికా స్క్రీన్ షేర్ చేసుకుని తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. దీపికా ఎక్కడున్నా అన్ లిమిటెడ్ ఫన్, ఎనర్జీ ఇస్తుంది అందుకే ఈ మధ్య అన్ని షోస్ లోకి ఆమెనే తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆహా వాళ్ళు నిర్వహిస్తున్న కాకమ్మ కథలు సీజన్ 2 లో దీపికా వచ్చేసింది.
కుకింగ్ షో అని లేదు డాన్స్ షో అని లేదు పరివారం షో అని లేదు ఏ షోలో ఐనా దీపికా ఉండాల్సిందే. ఇప్పుడు కాకమ్మ కథలు షోలో దీపికా ఫ్యూచర్ లో ఎం జరగబోతోందో చెప్పింది తేజస్విని మడివాడ. దీపికా ఫ్యూచర్ అని కొట్టగానే సౌందర్య ఫోటో వచ్చింది. దాంతో ఆమె ఎక్సయిట్మెంట్ మాములుగా లేదు. "నేను ఇంత అందంగా అవబోతున్నానా" అని అడిగేసరికి "నువ్వు ఆల్రెడీ ఇంత అందంగా ఉంటావు దీపికా" అంది తేజస్విని. "నిన్ను చూడగానే సౌందర్య గారు గుర్తొచ్చారు. ఆ బొట్టు, నువ్వు డ్రెస్ చేసుకున్న విధానం అన్ని..కానీ సౌందర్య గారు నీ లాగా మాట్లాడలేకపోయారు కానీ..ఐతే నువ్వు ట్రెడిషనల్ గా ఉంటావు చూడడానికి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు టెలివిజన్ సౌందర్యవి. ఐనా చూస్తే సౌందర్య గారి పోలికలు దీపికాలో చాలా కనిపిస్తున్నాయి. మనకు సౌందర్య దొరికేసింది..కానీ మనమే చూసుకోవడం లేదు. మన పక్కనే తిరుగుతోంది. సో ప్లీజ్ దయచేసి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవరైనా సరే మీ మూవీస్ లోకి సౌందర్య లాంటి అమ్మాయి కావలి అంటే వెంటనే దీపికాకు కాల్ చేయండి" అని చెప్పింది తేజస్విని. వెంటనే ఇక దీపికా "నెక్స్ట్ మూవీ వెంటనే నేను వెంకీ గారితో సైన్ చేస్తాను" అనేసింది.
ఇక దీపికకు న్యూస్ రీడర్ కావడం అంటే ఇష్టం అని తెలుసుకున్న తేజు రాపిడ్ ఫైర్ రౌండ్ ని కాసేపు పక్కన పెట్టి ఆమెతో వార్తలు చదివించింది. దీపికా కూడా తాను చేస్తున్న ఆ షో గురించి న్యూస్ రీడ్ చేసి కాసేపు ఫన్ క్రియేట్ చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
