ENGLISH | TELUGU  
Home  » TV News

ఆకట్టుకుంటున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ లేటెస్ట్ ప్రోమో!

on Apr 14, 2023

స్టార్ మా టీవీలో ప్రతీ ఆదివారం ప్రసారమవుతున్న సరికొత్త షో.. 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'. ఈ షోలో సీరియల్ యాక్టర్స్, మూవీ ఆర్టిస్ట్స్, కామెడీయన్స్ ని ఇలా ఫేమస్ సెలబ్రిటీలను అందరిని తీసుకొస్తూ వారితో సరదాగా గేమ్స్ ఆడిస్తూ  ప్రేక్షకులను వినోదాన్ని పంచుతుంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. ఫైమా, ముక్కు అవినాష్, పటాస్ హరి వచ్చిన గెస్ట్ లతో సరదాగా కాసేపు ఆడుకుంటూ ఈ షోని మరింత వినోదభరితం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ షోకి సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రోమోని చూస్తుంటే ప్రతీవారం లాగే ఈ వారం కూడా స్పెషల్ గెస్ట్ లతో, సరికొత్త జోడీలతో ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీముఖి 'సామీ సామీ' పాటకి డ్యాన్స్ చేసింది. సండే సెవెన్.. ఎంటర్‌టైన్మెంట్ కి హెవెన్ అంటూ శ్రీముఖి షోని మొదలెట్టగా.. కామెడీకి తగ్గేదేలే అంటూ.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ స్ఫూఫ్ తో ముక్కు అవినాష్ పటాస్ హరి మంచి కామెడీ టైమింగ్ తో నవ్వించగా, ఈ స్ఫూఫ్ లో సమంత గా పటాస్ ఫైమా ఎంటర్టైన్ చేసింది. ఆ తర్వాత స్పెషల్ జోడీస్ గా సీనియర్ కపుల్స్ అయినటువంటి సీనియర్ యాక్టర్ ప్రదీప్ -సరస్వతి, ప్రభాకర్ -మలయజ, ఇంద్రనీల్ -మేఘనలు ఈ షో కి రాగా.. జూనియర్ కపుల్స్ గా ఏక్ నాథ్ -హారిక, సీరియల్ యాక్టర్స్ దీప జగదీశ్, ఆమె భర్త, మహేశ్వరీ ఆమె భర్త, షో కి వచ్చి సందడి చేశారు. సీనియర్‌ యాక్డర్ ప్రదీప్ దగ్గర ఫైమా ఆశీస్సులు తీసుకుంటుంది. ఆమె ఎవరో తెలుసా.. బిబి జోడి టైటిల్ విన్నర్ ఫైమా, రన్నర్ అవినాష్ అని శ్రీముఖి చెప్తుంది. ప్రదీప్ -సరస్వతి గార్ల  సమక్షంలోనే  నీ పెళ్లి జరుగుతుంది. చిన్న పాలేరు తోనా పెద్ద పాలేరు తోనా ఎవరితోనో చెప్పు ఫైమా అని శ్రీ ముఖి అడుగుతుంది. ఎవరు చేసుకుంటారు పెళ్లి అని అవినాష్ అనగానే.. "నేను విన్నర్ అయితే నువ్వు విన్నర్ అయినట్లే కదా అవి" అని ఫైమా ప్రేమ అనగానే.. అందరూ నవ్వుతారు. ప్రభాకర్ మలయజ పెళ్లి కూడా మేమే చేసామని సీనియర్ యాక్టర్ ప్రదీప్ అనగానే.. ఆర్య సమాజ్ లో చేశారని ప్రభాకర్ అంటాడు. ప్రదీప్ సరస్వతి ఇద్దరు వారి అనుబంధం గురించి చెప్తారు. షోకి వచ్చిన ఒక్కో జంటకి ఒక్కో టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. షో మధ్యలో ముక్కు అవినాష్, శ్రీముఖిల మధ్య జరిగే కౌంటర్ ఎటాక్ లు నవ్వు తెప్పించాయనే చెప్పాలి.

ప్రభాకర్, మలయజ కి శ్రీముఖి టాస్క్ ఇస్తుంది. ప్రభాకర్ ఫోన్ హాల్లో ఉండగా.. ప్రభాకర్ ఫోన్ లో ఏదో మెసేజ్ చూస్తుంది మలయజ. ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి.. "మీరు మారరా అండి.. ఇలా ఎంత కాలం నమ్మించి మోసం చేస్తారు" అని మలయజ అనగా.. సంబంధం లేకుండా మాట్లాడుతున్నావ్.. ఏమైందని ప్రభాకర్ అంటాడు. నమ్మిస్తారు సాయంత్రం కాగానే కాళ్లు పట్టుకుంటారు అని మలయజ అనగానే.. "అన్నా.. నువ్వు కాళ్ళు పట్టుకుంటావా" అని అవినాష్ అనడంతో షోలోని వాళ్ళంతా నవ్వేస్తారు.‌ ఇలా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ కాంబోతో వచ్చిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.