ENGLISH | TELUGU  
Home  » TV News

పండు అంటే ఇష్టమన్న దివ్య.. మనది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అన్న శ్రద్దా

on May 3, 2023

ఢీ-15 క్వాటర్ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ వారం షో అటు డాన్స్ లవర్స్ కి ఇటు స్కిట్స్ ఇష్టపడే ఆడియన్స్ కి బాగా వినోదాన్ని పంచింది. టు ఇన్ వన్ షో ఇది. ఇందులో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఐపోయాక "ప్రసిద్ధ నటులు, కళాకారులు ఆది గారు స్టేజి మీదకు రావాలి" అని ప్రదీప్ పిలిచేసరికి ఆది వచ్చాడు. "క్వాటర్ ఫైనల్స్ వరకు వచ్చేసాం...మరి శ్రద్దా గారికి ఏం చెపుదామనుకుంటున్నావ్..వాట్సాప్ లో ఆవిడకు సాంగ్స్ పంపిస్తావ్ కదా..మరి మనస్ఫూర్తిగా ఏమనుకుంటున్నావో చెప్పు" అని అడిగేసరికి "లాస్ట్ నైట్ కూడా వస్తున్నా, వచ్చేస్తున్నా అనే సాంగ్ ని పంపించారు" అని చెప్పింది శ్రద్దా. "వన్ మంత్ గ్యాప్ వచ్చింది కదా అందుకే కలవడానికి వచ్చేస్తున్నా అని పెట్టా..ఆ వన్ మంత్ చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నాయి..కుదర్లేదు..అందుకే రాలేదు..అప్పుడు అన్ని అప్ డేట్స్ ని శ్రద్ధకు చెప్తూనే ఉన్నా" అని చెప్పాడు ఆది. 

"మీకేమన్న అప్ డేట్స్ ఇచ్చాడా" అని శేఖర్ మాస్టర్ ని ప్రదీప్ అడిగేసరికి "మాకు ఏ నా గతి లేదు" అన్నాడు. "ఒకవేళ నేను, శ్రద్దా ఇద్దరం షెడ్యూల్ కి రాకపోతే మీరు ఎవరిని ఎక్కువ మిస్ అవుతారు" అని శేఖర్ మాస్టర్ ని ఆది అడిగేసరికి "నిన్నే మిస్ అవుతాను ఆది" అన్నాడు. "కాదు మమ్మల్ని ఎవరూ మిస్ అవరా" అని మధ్యలో జెస్సి వచ్చి అడిగేసరికి "నిన్ను పండుగాడు మిస్సవుతాడు" అన్నాడు శేఖర్ మాస్టర్. "ఆది దివ్యతో ఫ్లర్టింగ్ చేస్తున్నాడు" అని జెస్సి చెప్పేసరికి "అలాంటిది ఏమీ లేదు" అని దివ్య క్లారిటీ ఇచ్చేసింది. "సరే దివ్య ఇప్పుడు చెప్పు నేను ఇష్టమా, ఆది ఇష్టమా" అని జెస్సి అడిగేసరికి "జెస్సి కేటగిరీలోకే రాడు.." అని చెప్పింది. "అసలేం జరుగుతోంది" అని పండు అడిగేసరికి "దివ్యకు నేనంటే ఇష్టం" అని ఆది అన్నాడు "నాకు శ్రద్దా అంటే ఇష్టం" అని జెస్సి చెప్పడంతో కోపం వచ్చిన శ్రద్ద "జెస్సి మనది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్" అని సీరియస్ గా చెప్పింది. ఇంతలో పండు వచ్చి "దివ్య నీ మనసులో ఉన్న విషయం చెప్పు" అని అడిగేసరికి "మాస్టర్ ఎప్పటినుంచో చెపుదాం అనుకుంటున్నా నాకు పండు అంటేనే ఇష్టం" అని చెప్పేసరికి అందరూ షాకయ్యారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.