ENGLISH | TELUGU  
Home  » TV News

రాజ్ డిఫెక్ట్ ని కనిపెట్టిన కావ్య.. అవును వాళ్ళిద్దరు ఒకే గదిలో..!

on May 4, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -86 లో.. స్వప్న ఒంటరిగా రావడంతో కనకం చూసి.. నీతో వచ్చిన అప్పు ఎక్కడ అని అడుగుతుంది. అప్పు ఏదో వర్క్ ఉందంటూ వెళ్ళిందని చెప్తుంది. మీ నాన్న గారు నీకో సంబంధం తెచ్చారు.. బుద్దిగా చెప్పింది విను.. వారం రోజుల్లో పెళ్ళని కనకం అంటుంది. ఇంతలో అప్పు వచ్చి.. కలిసావా మీ ఫ్రెండ్ ని అని అడుగుతుంది. కొంపదీసి ఇది నన్ను రాహుల్ ని చూసేసిందా ఏంటని స్వప్న భయపడుతుంది. మా ఫ్రెండ్ అమెరికా వెళ్తుంది. అందుకే ఒకసారి కలిసి వెళ్ళడానికి వచ్చిందని కవర్ చేస్తుంది. మళ్ళీ ఎవడితో లేచిపోవ్ కదా.. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు.. ఖర్చులైనా మిగులుతాయని అప్పు అంటుంది. ఇంకా వారం రోజులే టైమ్ ఉంది కదా.. నేను రాహుల్ ని పెళ్లి చేసుకోవడానికి ఒక్క రోజు చాలు.. అయిన నేను రాహుల్ ని పెళ్లి చేసుకున్నాక.. ఈ పూరి గుడిసెలో ఉండను.. దుగ్గిరాల ఇంటి కోడలిగా మహారాణిలాగా ఉంటానని స్వప్న తన మనసులో అనుకుంటుంది.

మరొకవైపు కావ్య, రాజ్ లు చేస్తోన్న వ్రతం పూర్తవుతుంది. ఈ బ్రహ్మముడి రేపు ఉదయం విప్పాలని పంతులు చెప్పడంతో.. రాత్రంతా కావ్య, రాజ్ లు పక్క పక్కనే ఉంటారు. హాల్లోనే రాజ్ నిద్రపోతుంటే.. అది గమనించిన రాజ్ నానమ్మ గదిలోకి వెళ్లి పడుకోమని చెప్తుంది. నేను గదిలోకి వెళ్తే తను కూడా నా వెంట వస్తుంది.. అలా ఏం వద్దని రాజ్ అంటాడు. నీ భార్యని నువ్వు గదిలోకి తీసుకొని వెళ్ళమని రాజ్ నానమ్మ అనగానే.. వద్దు వాడు ఇంకా ఆ అమ్మాయిని భార్యగా అంగీకరించలేదు కదా అని అపర్ణ అంటుంది. ఆగు అపర్ణ.. రాజ్ తన భార్య ని అంగీకరించకపోతే నేను కూడా నిన్ను అంగీకరించనని అపర్ణ భర్త సుభాష్ అంటాడు. అపర్ణ షాక్ అవుతు చూస్తుంది. ఏంటీ రాజ్.. మీ అమ్మ నాన్నలను విడదీస్తావా అని రుద్రాణి అనగానే.. కావ్యని రాజ్ తన గదిలోకి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ కావ్య మాత్రం రానని చెప్పడంతో.. ఎందుకని రాజ్ నానమ్మ అడుగుతుంది. ఆయన నన్ను మనస్ఫూర్తిగా పిలిస్తేనే వెళ్తానని కావ్య అనగానే.. వెళదాం పదా అని రాజ్ అంటాడు. దాంతో ఇద్దరు గదిలోకి వెళ్తారు. కావ్య రాజ్ గదిలోకి మొదటి సారి వెళ్లినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సీతరామయ్య దగ్గరికి ఇందిరాదేవి వెళ్లి.. ఆచారం పేరిట ఇదంతా పంతులు గారితో చెప్పి చేయించాం.. ఇబ్బంది ఏం ఉండదు కదా అని అంటుంది. ఇద్దరు మనుషులు ఒకటి అవ్వడానికి చేసే ప్రయత్నమే ఇది.. ఏం కాదులే అని సీతరామయ్య అంటాడు. 

ఆ తర్వాత రాజ్ బెడ్ పైన కావ్య నేల మీద పడుకుంటారు. రాజ్ గురక వల్ల కావ్యకి నిద్ర పట్టదు. ఎలాగైనా గురక రాకుండా చేయాలని రాజ్ ని డిస్టర్బ్ చేస్తుంటుంది. మిస్టర్ డిఫెక్ట్ కి ఈ డిఫెక్ట్ కూడా ఉందనుకుంటా అని అనుకొని నిద్ర పోకుండా అలాగే కూర్చొని రాజ్ నే చూస్తుంటుంది కావ్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.