ENGLISH | TELUGU  
Home  » TV News

మెడికల్ కాలేజీ పెడదామని చెప్పిన రిషి.. బస్తీలో వసుధార!

on Apr 11, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -733 లో.. వసుధారని పెళ్ళి చేసుకుంటా అని రిషి అంటాడు. రిషి వాళ్ళ పెద్దమ్మ దేవయానికి చెప్పి మంచి ముహూర్తం చూడమని చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు కలిసి అలా బయటకు వెళ్తారు. వసుధార కార్ లో కూర్చొని రిషి తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సర్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని వసుధార అడుగుతుంది. ఎంతసేపు మనమిద్దరం ఇలా వెళ్ళాలనిపిస్తే అంత సేపు వెళదామని రిషి చెప్తాడు. 

ఆ తర్వాత రిషి, వసుధారలు కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళాక రాజ్ కి వీఐపీతో కాల్ మాట్లాడటం, మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా బస్తీ విజిటింగ్ రెండూ ఒకేసారి ఉంటాయి. "మీరు కాల్ మాట్లాడండి.. నేను బస్తీ విజిటింగ్ కి వెళ్తాను" అని వసుధార అనగానే.. ఒక్కదానివే వెళ్తావా అని రిషి అంటాడు. వెళ్తానని వసుధార అంటుంది. కార్ లో వెళ్ళమని రిషి అనగా.. లేదు సర్ బస్తీలో స్కూటీ అయితేనే విజిటింగ్ ఈజీ అవుద్దని వసుధార అంటుంది. వసుధార ఒక్కతే వెళ్తుంటే.. తనకి రిషి మరీ మరీ జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత రిషి ఇంటికెళ్తాడు. అక్కడ జగతి, మహేంద్ర, ఫణింద్ర ముందు వీఐపీతో కాల్ మాట్లాడతాడు రిషి. ఫొన్ కాల్ లో ఉన్న ఆ వీఐపీ.. రిషిని, కాలేజీని గొప్పగా పొగుడుతాడు. రిషి ఫోన్ మాట్లాడడం అయిపోయాక.. డాడ్, పెద్దనాన్న నేనొక డెసిషన్ తీసుకున్నానని రిషి అంటాడు. ఏంటి అని ఫణీంద్ర అడుగగా.. మెడికల్ కాలేజీ పెడుదామని అనుకుంటున్నా, మెడికల్ కాలేజీ పెట్టి మంచి డాక్టర్స్ ని తయారు చేద్దామని రిషి అంటాడు. దానికి సరే అని మహేంద్ర, ఫణింద్ర అంటాడు. మరోవైపు వసుధార పని పూర్తి అయిపోతుంది.

ఆ తర్వాత రిషీకి మెసేజ్ చేస్తుంది. రిషి కూడా వర్క్ అయిపోయిందా అని అడుగుతాడు. అయిపోయింది కానీ మీరు లేకుండా నాకేం బాలేదని వసుధార అనగానే.. వస్తున్నా లొకేషన్ షేర్ చెయ్యమని రిషి అంటాడు. నేను చెప్పను మీరే తెలుసుకొని రండి అని వసుధార అంటుంది. అలా అనగానే వసుధార ఎక్కడ ఉందో గెస్ చేస్తుంటాడు రిషి. నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలుసు వసుధార వస్తున్నా అంటూ రిషి తన మనసులో అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.