ENGLISH | TELUGU  
Home  » TV News

ప్లాస్టిక్ ని కాదు.. నైటీలని బ్యాన్ చేయండని చెప్పిన హైపర్ ఆది!

on Apr 11, 2023

ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ షోకి యాంకర్ గా రష్మీ చేస్తుండగా.. నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుధీర్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, వర్ష, ఇమ్మాన్యుయెల్ ఇంకా కొంతమంది కామెడియన్స్ తమ కామెడీతో అల్టిమేట్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుండగా.. ఈ షో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న షోగా 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' పేరు తెచ్చుకుంది.

అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు యాజమాన్యం.  భార్యాభర్తల మధ్య గొడవని కామెడీగా చూపించారు. అందులో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, ఇమ్మానుయేల్ ఫ్రస్టేషన్ గల భర్తలుగా చేయగా.. వర్ష, సుజాత, ఇంకా కొందరు భార్యలుగా నటించి ఫన్ జనరేట్ చేశారు. ఇందులో హైపర్ ఆది తన మార్క్ పంచ్ లతో షో మొత్తం నవ్వులు పూయించాడు. "సంక్రాతి పండుగకి చీర అడుగుతారు. పోనీ అది కడతారా కట్టరు. ఒక నైటీ వేసుకొని.. దానితోనే పిల్లాడి ముక్కు తుడుస్తూ, అది కూడా చేసి, అన్నీ ఆ నైటీతోనే చేసి మళ్ళీ మా దగ్గరికి కూడా వస్తారు.  గవర్నమెంటోళ్ళకి చెప్తున్నాను ప్లాస్టిక్ ని కాదు, ఆ నైటీని బ్యాన్ చెయ్యండి" అని హైపర్ ఆది అనగానే.. షో మొత్తం నవ్వులతో నిండిపోయింది. 'వకీల్ సాబ్' ఫేమ్ సూపర్ ఉమెన్ సరళా దేవి, బుల్లెట్ భాస్కర్ కి భార్యగా డ్రింక్ చేస్తూ కనిపించింది. ఇమాన్యుయెల్, వర్ష ఒక జంటగా పర్ఫామెన్స్ చేసారు. రాకింగ్ రాకేష్-సుజాతల పెళ్ళి తర్వాత  ఫస్ట్ టైం ఈ షోకి రావడంతో‌ హైలైట్ గా నిలిచారు. 'లక్స్ పాప లక్స్ పాప'  పాటకి సుజాత- రాకేష్ కలిసి చేసిన ఈ  డాన్స్ పర్ఫామెన్స్ ని హైలెట్ అఫ్ ది ప్రోమోగా చెప్పుకోవచ్చు. ఆ డాన్స్ పర్ఫామెన్స్ చూసిన ఇంద్రజ సూపర్ పర్ఫార్మన్స్, ఫెంటాస్టిక్ అంటూ మెచ్చుకుంది. ఆ తర్వాత భార్యాభర్తలుగా చేస్తున్న ఆ జంటలకి.. ఆడవాళ్లు డబ్బులు లెక్కపెడుతుంటే, మగవాళ్ళు వచ్చి డిస్టర్బ్ చెయ్యాలని రష్మీ టాస్క్ ఇచ్చింది. ఇందులో వర్ష డబ్బులు లెక్కిస్తుండగా.. నిన్న రాత్రి 11గంటలకి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదని ఇమాన్యూయెల్ అనగానే.. వర్ష డిస్టర్బ్ అవుతుంది. దాంతో షోకి వచ్చిన వాళ్ళంతా నవ్వుకుంటారు.

ఈ షో లో చివర్లో ఒక డ్యాన్సర్ చేసిన బెల్లీ డాన్స్ ఆకట్టుకుంది.  ఆ డ్యాన్స్ చూసాక హైపర్ ఆది.. ఇదే డాన్స్ మా పెళ్ళాలు చేస్తే ఎలా ఉంటుందని అంటాడు‌ అప్పుడు రష్మీతో సహా అందరు ఆడవాళ్లు బెల్లీ డాన్స్ చేస్తారు. 'ఆ నాగు పాము కాటు వేసింది' అనే పాటని వెయ్యండని హైపర్ ఆది చెప్పగా.‌‌. ఆ పాటకి మగాళ్ళందరూ డాన్స్ చేస్తారు. ప్రోమోనే ఈ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంటే.. ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.