Podharillu : చక్రిని చంపడానికి రౌడీలతో వెళ్ళిన ఆది.. మహా ఏం చేయనుంది!
on Jan 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -31 లో.... మహాని చక్రి పెళ్లి చేసుకొని వాళ్ళింటికి బయల్దేరతాడు. ఇంకా ఎంత దూరం.. అసలు మీ వాళ్ళు మనల్ని ఇంట్లోకి రానిస్తారా అని మహా అడుగుతుంది. ఆ రోజు అన్నీ మా కుటుంబం గురించి కల్పించి చెప్పాను కానీ ఇప్పుడు ఏం అంటుందోనని చక్రి భయపడుతాడు. మనం జరగదని అనుకున్నప్పుడు ఏవేవో చెప్తాము కానీ అది జరిగినప్పుడు చెప్పినవన్ని మర్చిపోవాలని చక్రి సంబంధం లేకుండా మాట్లాడుతాడు. మీరు మీ ఇంటికి దగ్గరగా వెళ్తున్నారు. నేను మా ఇంటికి దూరంగా వెళ్తున్నానని మహా బాధపడుతుంది.
మరొకవైపు ప్రతాప్ ఇంటికి వెళ్తాడు. మహా ఎక్కడ అండి అని లలిత అడుగుతుంది. ప్రతాప్ వాటర్ తలపై పోసుకొని.. నాకు కూతురు లేదని లోపలికి వెళ్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. అసలు ఏమైందని లలిత అడుగగా పెళ్లి అయింది. ఆ డ్రైవర్ తో లేచిపోయిందని భూషణ్ చెప్తాడు. అంటే మమ్మల్ని మీరు అంతా మోసం చేసారా అని భూషణ్ పేరెంట్స్ ప్రతాప్ ని తిడుతారు. చక్రి, మహా పెళ్లి చేసుకున్న ఫోటోని భూషణ్ చూపించగనే హారిక, లలిత షాక్ అవుతారు. ప్రతాప్ మౌనంగా లోపలికి వెళ్తాడు. మరొకవైపు చక్రి ఇంటి ముందు తన అన్నదమ్ములు సందడి చేస్తుంటే తాయారు, గాయత్రి అటుగా వెళ్తు చూస్తారు. ఏంటో కనుక్కొని రమ్మని గాయత్రిని తాయారు పంపిస్తుంది. గాయత్రి వెళ్ళగానే అక్కడున్న కన్నా.. మా అన్న పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. దాంతో మాధవ అనుకొని గాయత్రి ఏడుస్తుంది. అప్పుడే మాధవ వచ్చి నేను కాదు చక్రి అని చెప్తాడు.
మరొకవైపు మహా ఇంత మోసం చేస్తుందనుకోలేదని లలిత తన ఫోటో చూస్తూ ఏడుస్తుంది. అల్లుడు గారు ఎక్కడ అని హారిక వాళ్ళ అమ్మ అడుగుతుంది. అవును ఇంకా రాలేదని ఆదికి హారిక ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ కలవదు. ఆది ఆ చక్రిని ఏమైనా చెయ్యడానికి వెళ్లాడా అని హారిక భయపడుతుంది. మరొకవైపు చక్రిని చంపడానికి రౌడీలతో చక్రి ఇంటికి బయల్దేర్తాడు ఆది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



