ENGLISH | TELUGU  
Home  » TV News

షాకింగ్.. రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర కన్నుమూత!

on May 12, 2024

బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించారు. త్రినయిని సీరియల్‌తో పాపులరైన ఆమె.. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఈరోజు తెల్లవారుజామున కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‏ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డుకు కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె  అక్కడిక్కడే మరణించారు. కార్ లో ఉన్న ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించారు. కానీ  తెలుగులో త్రినయని సీరియల్ లో తిలోత్తమ పాత్రతో బాగా పాపులర్ అయ్యారు.   ఈ సీరియల్లో విలన్ రోల్ లో నటించారు. పవిత్ర… మాండ్య తాలూకాలోని హనకెరెకు చెందినవారు. ‘రోబో ఫ్యామిలీ’, ‘జోకలి’, ‘నీలి’, ‘రాధారామన్’ వంటి కొన్ని సీరియల్స్ లో నటించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.