ENGLISH | TELUGU  
Home  » TV News

Little hearts : లిటిల్ హార్ట్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్.. యూట్యూబ్  లో ఫుల్ ట్రెండింగ్!

on May 12, 2024

యూట్యూబ్ లో రెగ్యులర్ గా ఫ్రెష్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటిల్లో ఈ మధ్యకాలంలో మావిడాకులు, పెళ్ళివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో ప్రసాద్ బెహరా ఫేమస్ అయ్యాడు. అయితే అతనితో పాటు కొంతమంది కొత్త యాక్టర్స్ ఫేమస్ అవుతున్నారు.

కన్నా, నవ్య నాయుడు చిట్యాల లాంటి వారు తమ వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయ్యారు. అయితే వీరిద్దరు కలిసి 'లిటిల్ హార్ట్స్' అనే ఇండిపెండెంట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ని  చేశారు. ఇది తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లక్ష యాభై వేల వ్యూస్ ని చేరుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఇంత క్రేజ్ ఎందుకు అంటే కథ బాగుండటమే.. అను, సాగర్ అనే ఇద్దరు నాలుగు సంవత్సరాల నుండి రిలేషన్ లో ఉంటారు. అయితే ఒకరోజు ఇద్దరు ఛాటింగ్ లో‌ అను ఏం మెసెజ్ చేసిన అన్నింటికి వన్ వర్డ్ అన్సర్ ఇస్తుంటాడు సాగర్. దాంతో తను నెట్ ఆఫ్ చేస్తుంది.‌ఇక సాగర్ కాల్ చేసి కలుద్దామని అంటాడు. ఏమైందని సాగర్ అడుగగా.. అసలు నన్ను పట్టించుకోవడం లేదని అను అంటుంది. నాది నీలా సాఫ్ట్‌వేర్ జాబ్ కాదు కదా, ఆరు గంటలకే లాగవుట్ చేసి‌ బయటకు రావడానికి అని సాగర్ అనగానే.. ఎప్పుడు చూసిన పని, పని అని కోపంలో కార్ అద్దాన్ని కొట్టగా చేతికు గాయమతుంది. దాంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళి వైద్యం చేస్తాడు డాక్టర్ సాగర్. ఇక అక్కడ నర్స్ గా సరోజమ్మ చేస్తుంటుంది.

ఇక అను(నవ్య నాయుడు చిట్యాల), డాక్టర్ సాగర్(కావ్య) ల ప్రేమ విషయం తెలుసుకుంటుంది సరోజమ్మ. మేమిద్దరం విడిపోతున్నామని అను అనగానే.. తనకెప్పుడు పనే నన్ను పట్టించుకునే టైమ్ లేదని అను అంటుంది. దాంతో సరోజమ్మ .. అవునులే అమ్మా.. సర్ తో ఏ అమ్మాయి ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే తనకి ఎప్పుడు పనే..‌ ఆపదలో ఉన్నా, యాక్సిడెంట్ అయిన వారి ప్రాణాలు కాపాడాలనే చూస్తాడని సరోజమ్మ అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే యూట్యూబ్ లోని ఈ షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.