Karthika Deepam2 : దాస్ ని తీసుకెళ్ళిన దొంగలు.. కార్తీక్ కనిపెడతాడా!
on Jan 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -575 లో.... కాంచన పూజ చేసి తన తాళిని మొక్కుకుంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. ఇద్దరి మధ్యలో ఎప్పుడు జరిగే సంభాషణనే నడుస్తుంది. నీ భర్తగా నన్ను అంగీకరించు.. నువ్వు నాకు కావాలని శ్రీధర్ అనగా.. అది జరగదని కాంచన అంటుంది. వెళ్లి రెడీ అవ్వు మా మావయ్య ఇంటికి వెళ్ళాలని శ్రీధర్ అనగా.. రానని కాంచన అంటుంది. మా బావగారు తీసుకొని రమ్మన్నారని శ్రీధర్ చెప్తాడు.
మరొకవైపు కిచెన్ లో వంట చేస్తున్న దీప దగ్గరికి సుమిత్ర వస్తుంది. నువ్వు టైమ్ కి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా అని అడుగుతుంది. వేసుకుంటున్నానని దీప అంటుంది. అమ్మగారు నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను.. మిమ్మల్ని చూసుకుంటానని దీప అనగానే నన్ను చూసుకోవడానికి నా కూతురు ఉంది కదా అని సుమిత్ర అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. అమ్మమ్మ నీకొక సర్ ప్రైజ్.. ఇప్పుడు నానమ్మ వస్తుందని చెప్తుంది. దాంతో వదిన వస్తుందా అని సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు హాల్లోకి వెళ్తారు. కాంచనని చూసి సుమిత్ర తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. వదిన కోసం రక్ష తీసుకొని వచ్చానని తన చేతికి కడుతుంది. జ్యోత్స్న ఫోన్ వస్తే పక్కకి వెళ్తుంది. ఫోన్ చేసింది రౌడీలు.. మీ నాన్న తప్పించుకున్నాడని ఆ రౌడీ చెప్తాడు.
దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే దాస్ గేట్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఎలాగైనా ఆపాలని జ్యోత్స్న అనుకుంటుంది. దాస్ లోపలికి రావడంతోనే రౌడీలు వచ్చి.. తనని బయటకి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నా కొడుకు ఇక్కడికి వచ్చాడని బయటకు వస్తుంది పారిజాతం. కానీ ఆ లోపే దాస్ ఉండడు. అదే విషయాన్ని పారిజాతం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవరు నమ్మరు. కార్తీక్ మాత్రం నమ్ముతాడు. పైనుండి చూస్తున్న జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్లి.. దాస్ మావయ్య వచ్చాడు చూసావా అని అడుగుతాడు. లేదని జ్యోత్స్న అంటుంది. నేను చూసానని పారిజాతం అంటుంది. సరే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అని కార్తీక్ అనగానే మంచి ఐడియా అని పారిజాతం అంటుంది. ఇప్పుడు రౌడీలు తీసుకొని వెళ్ళింది తెలిసిపోతుందని జ్యోత్స్న భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



