Jayam Serial : విభూది బాబా దొంగ అని తెలుసుకున్న గంగ.. శకుంతల నమ్ముతుందా!
on Jan 24, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -176 లో... విభూది బాబా శకుంయల వాళ్ళ ఇంటికి వచ్చి వీరు చెప్పినట్లు చెప్తాడు. గంగ వల్ల ఇంటికి అరిష్టం.. ఒకవేళ గంగ, రుద్ర కలిస్తే.. తన భర్తకి అరిష్టం అని విభూది బాబా చెప్తాడు. దాంతో నేను ముందే చెప్పాను కదా అని శకుంతల అంటుంది. స్వామి చెప్పింది విని గంగ ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. గంగ ఇంట్లో లేదని రుద్ర తనని వెతుక్కుంటూ వెళ్తాడు.
గంగ ఏడుస్తూ బాక్సింగ్ పోటి జరిగిన ప్లేస్ కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లలేను.. అలాగని బస్తీకి కూడా వెళ్ళలేను. నాకు చావు ఒక్కటే మార్గం అనుకుంటుంది. అమ్మో నేను చనిపోయానని యాక్టింగ్ చేస్తేనే రుద్ర సర్ కొట్టాడని అనుకుంటుంది. అంతలోనే గంగ దగ్గరికి వీరు పంపిన రౌడీలు వస్తారు. గంగని చంపబోయే ప్రయత్నం చేస్తారు. గంగ ఎదురు తిరిగి వాళ్ళని కొడుతుంది. అంతలోనే పోలీసులు అటుగా వెళ్తుంటే గంగ జరిగింది చెప్తుంది. రౌడీలని పోలీసులు అరెస్ట్ చేసి.. మీరు ఒకసారి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని అనగానే గంగ పోలీసులతో స్టేషన్ కి వెళ్తుంది. మరొకవైపు గంగ గురించి C.Iతో మాట్లాడుతాడు. నా భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది తన ఫోటో అని C.I కి చూపిస్తాడు. రుద్ర అప్పుడే స్టేషన్ నుండి వెళ్ళిపోతాడు. గంగ పోలీసులతో స్టేషన్ కి వస్తుంది. స్టేషన్ లో వాంటెడ్ లిస్ట్ లో విభూది బాబా ఫోటో చూసి షాక్ అవుతుంది. అతను స్వామి కాదా అని గంగ అనగానే వాడు పెద్ద ఫ్రాడ్ అని చెప్తాడు. అంటే వాడు చెప్పిందంతా అబద్దం అన్నమాట అని వాడి వల్లే నేను ఇంట్లో నుండి బయటకు వచ్చాను. వాడి సంగతి చెప్తానని గంగ కోపంగా వెళ్ళిపోతుంది. ఇన్‌స్పెక్టర్ C.I దగ్గరికి వెళ్తాడు.
ఈవిడ గంగ మిసెస్ రుద్ర ప్రతాప్ గారు కనిపించడం లేదట అని ఫోటో చూపిస్తాడు. అది ఇన్‌స్పెక్టర్ చూసి ఇప్పటివరకు ఆవిడ స్టేషన్ లో ఉంది. తనపై రౌడీలు ఎటాక్ చేసారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. మళ్ళీ స్టేషన్ లో విభూది బాబా ఫోటో చూసి వాడి వల్లే ఇంట్లో నుండి వచ్చానంటూ వాడి సంగతి చెప్తానంటూ వెళ్ళిందని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. దాంతో రుద్రకి C.I కాల్ చేసి జరిగింది చెప్తాడు. మీరు విభూది బాబా దగ్గరికి రండి నేను వస్తానని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత దొంగ విభూది బాబా దగ్గరికి గంగ వెళ్లి ఎందుకు ఇలా చేసావని కొడుతుంది. అప్పుడే రుద్ర వచ్చి.. నీది తప్పు.. ఇలాంటి వాళ్ళని నమ్మడం అని రుద్ర అంటాడు. పోలీసులు వచ్చి స్వామిని అరెస్ట్ చేస్తారు. గంగని తీసుకొని రుద్ర ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



