మహేష్ బాబు లాంటి హజ్బెండ్ కావాలి
on Jul 23, 2025

సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఐతే ఈ షోకి "మిత్ర మండలి " మూవీ మూవీ హీరోయిన్ ఎన్ఎం.నిహారిక వచ్చింది. ఈ మూవీ టీమ్ మరో వైపు సుమ అడ్డా షోకి కూడా మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు. ఇక ఇటు సుధీర్ ఐతే "మీది బాంబేనా, బెంగళూరా చెప్పండి కరెక్ట్ గా" అంటూ సుధీర్ నిహారికకు అడిగాడు. "విజయవాడ మాది" అంది."హే విజయవాడలో ఎక్కడా" అంటూ ఎక్కడలేని ఉత్సాహంతో సుధీర్ అడిగాడు. "అక్కడే" అంటూ ఫన్ చేసింది. అలాగే సుమ అడ్డా షోలో సుమా "మీది ఏ ఊరు" అని అడిగింది. " మా అమ్మ వాళ్ళది విజయవాడ..పుట్టింది చెన్నై, పెరిగింది బెంగళూర్, ఉండేది బాంబే" అని చెప్పింది. "ఒహ్హ్ అందుకే అన్నీ కవర్ చేస్తున్నావన్న మాట" అంటూ సుమ కౌంటర్ వేసింది. ఈమె తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. ప్రియదర్శి "తెలివి తోటలు కాదు తేటలు" అంటూ కరెక్ట్ చేసాడు. "తెలివి తేటలే అన్నాను. నా తెలుగును కరెక్ట్ చేయకండి. మీకు ఇంత తెలివి ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పండి" అంటూ గట్టిగానే కౌంటర్ వేసింది.
ఇక ఈమె కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ , ఎంబిఏ, ఎంఎఫ్ఏ చేశానంటూ సర్కార్ ప్రోమోలో చెప్పింది. మిత్రమండలి మూవీ టీజర్ రిలీజ్ టైంలో ఈమె గురించి అల్లు అరవింద్ కూడా ఒక కామెంట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఈమెయే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఒక ఫేక్ ఐడితో ఆమెను ఫాలో అవుతుంటాను అని చెప్పారు. "ఫ్యూచర్ లో మీకు ఎలాంటి హజ్ బెండ్ రావాలని అనుకుంటున్నారు" అని సుమ అడగడంతో "చిన్నప్పటినుంచి మహేష్ బాబేనండి" అని చెప్పింది. "నటనలో ఏ హీరోయిన్ ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు" అని అడిగింది. "ఐ లవ్ సాయి పల్లవి" అని చెప్పింది నిహారిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



