18 నెలలు నేను భోజనం చేసాను అంటే మా ఆవిడ జీతం వల్లనే..
on Jul 23, 2025

ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి నూకరాజు, తేజస్విని గౌడ, శ్రీకర్ కృష్ణ, కెవ్వు కార్తీక్, రీతూ చౌదరి, అభినయశ్రీ, కృష్ణ కౌశిక్ వంటి బుల్లితెర నటులంతా వచ్చారు. బాచిలర్స్ వెర్సెస్ మ్యారేజర్స్ అంటూ ఒక కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఇక పెళ్లి లైఫ్ లో ఎంత ముఖ్యమో కూడా వీళ్ళు చెప్పారు. అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అంటారు కానీ నేను దాన్ని నమ్మను. కరోనా టైంలో మనమంతా ఖాళీగా ఉన్నాం. అప్పుడు మా ఆవిడ జాబ్ చేస్తోంది. నేను ఇప్పటికీ గర్వంగా చెప్తా ఆ 18 నెలలు నేను భోజనం చేసాను అంటే మా ఆవిడ జీతం వల్లనే..పెళ్లి అద్భుతం, అమోఘం." అంటూ కృష్ణ కౌశిక్ చెప్పుకొచ్చాడు. "నా లైఫ్ లో మా అమ్మకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాక ఆమె కోరుకున్నది ఒక్కటే నాకు పెళ్లి చేయాలని.
మా అమ్మ ఉన్నప్పుడే నాకు పెళ్లి అయ్యింది. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయినా తర్వాత నాకు తెలిసింది మా అమ్మ నాకు ఎందుకు పెళ్లి చేసిందో అర్ధమయ్యింది.." అంటూ కెవ్వు కార్తీక్ కూడా పెళ్ళి యొక్క విలువ గురించి చెప్పుకొచ్చాడు. ఇక రీతూ చౌదరి ఐతే " పెళ్లి చేసుకోకపోతే ఏ స్ట్రెస్ ఉండదు. సో నో మ్యారేజ్" అంటూ పెళ్లి చేసుకోకపోవడం బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అభినయశ్రీ ఐతే పెళ్లి అంటే ఇంటరెస్ట్ రాలేదని చెప్పింది. ఇప్పుడే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానని చెప్పింది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన పెళ్లిళ్లు చేసుకోవడం అనేది తగ్గిపోయింది. ఒకవేళ చేసుకున్నా కూడా అవి ఎంతో కాలం నిలబడడం లేదు. కానీ పెళ్లి అంటే జీవితంలో ఎంత ముఖ్యమో ఈ బుల్లితెర నటులు చక్కగా చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



