Bigg Boss Sanjana Elimination: సంజన ఎలిమినేషన్.. నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయేల్ అవుట్!
on Dec 21, 2025

బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి యాంకర్ శ్రీముఖి, ప్రదీప్ వచ్చారు. హౌస్ లోని టాప్-5 కంటెస్టెంట్స్ తో సరదాగా కబుర్లు చెప్పారు.
బిబి జోడీ సీజన్-2 కి హౌస్ మేట్స్ నుండి రావాలని అడుగగా అందరు వస్తానని అన్నారు. ఇక హౌస్ మేట్స్ తో పిల్లులు ఎలా అరుస్తాయో చేసి చూపించమన్నాడు బిగ్ బాస్. తనూజ, కళ్యాణ్, సంజన పిల్లులుగా బాగా సౌండ్ చేశారు.
ఆ తర్వాత ఓ ఫన్ స్కిట్ చేపించాడు యాంకర్ ప్రదీప్. పుష్ప కేక్ డెలివరీ బాయ్ గా వచ్చాడు. చిట్టిబాబుగా కళ్యాణ్, భానుమతిగా తనూజ లవర్స్ లాగా , పుష్పగా ఇమ్మాన్యుయేల్ యాక్ట్ చేశారు. ఇది ఫుల్ ఫన్ గా ఉంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో యాంకర్ శ్రీముఖి, ప్రదీప్ వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ చేసి వెళ్లారు.
ఇదిలా ఉంటే.. సంజన ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాల్గో స్థానంలో ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఓటింగ్ ప్రకారం ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉండాలి కానీ నాల్గో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇది నిజంగా అన్ ఫెయిర్.. హౌస్ లో ఎక్కువగా టాస్క్ లు ఆడి గెలిచింది ఇమ్మాన్యుయేల్. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అతడి వల్లే ఎక్కువగా జనరేట్ అయింది. అతను రన్నరప్ గా కానీ టాప్-3 కి డిజర్వ్ అని ఆడియన్స్ అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



